Musi projectకు కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-08-04T14:44:02+05:30 IST

మూసీ ప్రాజెక్ట్‌ (Musi project)కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Musi projectకు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‌ (Musi project)కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఏడు గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 8,889.95 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 11,848.06 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా... ప్రస్తుత సామర్థ్యం 638.10 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.80 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-08-04T14:44:02+05:30 IST