జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-25T16:38:52+05:30 IST

ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లకు వరద కొనసాగుతోంది. జలాశయాల

జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద

రెండోరోజూ ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల

హైదరాబాద్‌ సిటీ: ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లకు వరద కొనసాగుతోంది. జలాశయాల నీటిమట్టాలు పెరుగుతుండడంతో అందుకనుగుణంగానే గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఉస్మాన్‌సాగర్‌కు 1,600క్యూసెక్కుల వరద వచ్చింది. ఆరు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 1,788 క్యూసెక్కుల నీటిని దిగువన మూసీలోకి వదిలారు. ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790అడుగులు కాగా, ప్రస్తుతం 1787.20అడుగుల మేర  నీటిమట్టం ఉంది.  హిమాయత్‌సాగర్‌కు 300 క్యూసెక్కుల నీరు వచ్చింది. రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1,760.70 అడుగుల మేర నీటిమట్టం ఉంది. 

Updated Date - 2022-07-25T16:38:52+05:30 IST