అలంపూరు అభివృద్ధికి నిరంతరం కృషి

ABN , First Publish Date - 2022-07-01T06:18:56+05:30 IST

అలంపూరు మునిసిపా లిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

అలంపూరు అభివృద్ధికి నిరంతరం కృషి
అలంపూర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూరు, జూన్‌ 30 : అలంపూరు మునిసిపా లిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. అలంపూరు మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌ మనోరమ అధ్యక్షత గురువారం నిర్వహిం చిన సర్యసభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మునిసిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి రూ.10 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయించామన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు, నూతన మునిసిపాలిటీ భవన నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నామన్నారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ రెడ్డి, కమిషనర్‌ నిత్యానంద్‌, కౌన్సిలర్లు సుదర్శన్‌గౌడ్‌, ఇంతియాజ్‌ అలీ, సుష్మ, లక్ష్మీదేవి, కో ఆప్షన్‌ మెంబర్‌ అల్లబకాష్‌, బతుకయ్య, సిబ్బంది నారాయణ, షరీఫ్‌ పాల్గొన్నారు.   


వడ్డేపల్లి : మునిసిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానని అలంపూరు ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. వడ్డేపల్లి మునిసిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ కరుణసూరి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్నుల రూపం లో వసూలైన డబ్బును అభివృద్ధికి వాడుకోవా లన్నారు. వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ సుజాత, మునిసిపల్‌ కమిషనర్‌ నిత్యానంద్‌, కౌన్సిలర్లు రవి, లలిత, ధనలక్ష్మి, ఆంజనేయులు పాల్గొన్నారు. 


అందరూ సహకరించాలి

అయిజ టౌన్‌ : అయిజ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే అబ్రహాం సూచించారు. అయిజలోని ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో చైర్మన్‌ దేవ న్న ఆధ్వర్యంలో గురువారం మునిసిపల్‌ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ కలిసికట్టుగా అయిజను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నరసింహులు, కమిషనర్‌ నర్సయ్య, మేనేజర్‌ రాజేష్‌ కుమార్‌, ఏఈ గోపాల్‌, కౌన్సిల్‌ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T06:18:56+05:30 IST