నిమజ్జనానికి నిరంతర నిఘా

ABN , First Publish Date - 2021-09-16T06:08:53+05:30 IST

జిల్లాలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చురుగ్గా సాగుతు న్నాయి.

నిమజ్జనానికి నిరంతర నిఘా
వినాయక్‌ సాగర్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి

నిర్విరామంగా జిల్లా పోలీసుల విధులు

శాంతి భద్రతలకు పటిష్ట చర్యలు

జియో ట్యాగింగ్‌.. సీసీ కెమెరాలు

ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

నిబంధనలు పాటించాలి : ఎస్పీ

భక్తిభావనతో పాల్గొనాలి : మంత్రి

నిర్మల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 15 : జిల్లాలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చురుగ్గా సాగుతు న్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం, నాయకగణం ఈ మేరకు స మావేశమై కార్యాచరణ రూపొందించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదే శాలతో మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ పట్టణంలో రోడ్లు, విద్యుత్‌ పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఉత్సవకమిటీ సభ్యులతో సమావేశమై ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాల్గొనాలని సూచించారు. 

గణేష్‌ మండళ్లకు జియో ట్యాగింగ్‌

పట్టణంతో పాటు నిమజ్జనం జరిగే ప్రధాన పట్టణాల్లో జియో ట్యా గింగ్‌తో పోలీస్‌శాఖవెబ్‌కు అనుసంధానం చేశారు. దీనితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిమజ్జనాన్ని పర్యవేక్షించ వచ్చు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నిర్వాహకుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించి ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా ఎస్పీ చర్యలు చేపట్టారు. వినాయక ఉత్సవాలు ప్రారంభం నుండి నిమజ్జనం వరకు పోలీస్‌ శాఖ కంటికి కునుకు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. నిర్మల్‌, ఖానా పూర్‌లో 19న, భైంసాలో 18న నిమజ్జనం నిర్వహించనున్నారు. 

ప్రత్యేక ఏర్పాట్లు

నిర్మల్‌ పట్టణంలో ప్రశాంతంగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహిం చేందుకు మున్సిపల్‌ విద్యుత్‌శాఖ ఏర్పా ట్లు చేస్తుంది. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో రోడ్డు, మురికి కాలువలు మరమ్మతు చేయడంతో పాటు విద్యుత్‌ లైన్లు సవరిస్తున్నారు. వినాయక్‌సాగర్‌ వద్ద నిమజ్జనా నికి క్రేన్‌లు ఉపయోగిస్తున్నారు. దారి పొడుగునా మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

నిరంతర నిఘా... వరుసగా పోలీసుల బిజీ

వినాయక నవరాత్రుల సందర్భంగా పోలీస్‌శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తోంది. మండపాల వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసు కోకుండా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. భైంసా, నిర్మల్‌ డివిజన్‌లో ప్రత్యేకపోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలో ఈ నెల 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించనుండగా 18న భైంసా, 19న నిర్మల్‌లో జరిగే నిమజ్జన శోభాయాత్ర నిర్వహణ పోలీస్‌శాఖకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. భైంసాలో ఎస్పీ కిరణ్‌కారే నేతృత్వంలో నిమజ్జన బందోబస్తు జరుగుతుండగా నిర్మల్‌లో ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్‌ బందోబస్తు కొనసాగుతోంది.

Updated Date - 2021-09-16T06:08:53+05:30 IST