కాంట్రాక్ట్‌ ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలి

ABN , First Publish Date - 2021-06-20T05:51:16+05:30 IST

వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చట్టభద్రత కల్పించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులోని ఉద్యాన శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద శనివారం నల్లబాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలి
గుంటూరులో ఆందోళనచేస్తున్న ఉద్యోగులు

గుంటూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చట్టభద్రత కల్పించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులోని ఉద్యాన శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద శనివారం నల్లబాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాబయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైౖర్మన్‌ సుమన్‌, ప్రధాన కార్యదర్శి డి.భానూజీరావు, పి.గురునాఽథ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈఎస్‌ఐ, మినిమంస్కేల్‌ వంటి చట్టభద్రత కల్పించాలని,  కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని కోరుతూ సోమవారం నుంచి రాష్ట్రవాప్తంగా ఆందోళన చేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.        

 

Updated Date - 2021-06-20T05:51:16+05:30 IST