కాంట్రాక్ట్ ఆరోగ్య సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
ABN , First Publish Date - 2021-06-19T05:17:20+05:30 IST
కాంట్రాక్ట్ ఆరోగ్య సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
నందిగాం : కాంట్రాక్ట్ ఆరోగ్య సిబ్బందిని క్రమ బద్ధీకరించాలని నందిగాం పీహెచ్ సీ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. శుక్రవారం నాటికి 19వ రోజు కార్యక్రమంలో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో వెంకటరావు, శంకరరావు, ఫల్గుణరావు, మీన తదితరులు పాల్గొన్నారు.