మానసిక ఒత్తిడితో ఆగిన కాంట్రాక్టర్‌ గుండె

ABN , First Publish Date - 2021-11-27T06:19:48+05:30 IST

ప్రభుత్వం నుంచి బ కాయిలు విడుదల కాక ఆందోళనతో ఓ మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ గుండె ఆగింది. ఆరు నెలల క్రి తం అద్దంకి పట్టణంలోని సాయినగర్‌కు చెందిన వల్లెపు కొండలరావు(50) మానసిక ఆందోళనకు గురై మృతిచెందాడు. శుక్రవారం దర్శికి చెందిన కుంచాల శ్రీనివాసరావు(48) గుండెపోటుతో మృ తిచెందాడు.

మానసిక ఒత్తిడితో ఆగిన కాంట్రాక్టర్‌ గుండె
కుంచాల శ్రీనివాసరావు

అద్దంకిలో మున్సిపల్‌ పనులు చేసిన మరొకరు మృతి 

రూ.2కోట్ల వరకు రావాల్సిన బకాయిలు


అద్దంకి, నవంబరు 26: ప్రభుత్వం నుంచి బ కాయిలు విడుదల కాక ఆందోళనతో ఓ మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ గుండె ఆగింది.  ఆరు నెలల క్రి తం అద్దంకి పట్టణంలోని సాయినగర్‌కు చెందిన వల్లెపు కొండలరావు(50) మానసిక ఆందోళనకు  గురై మృతిచెందాడు. శుక్రవారం దర్శికి చెందిన కుంచాల శ్రీనివాసరావు(48) గుండెపోటుతో మృ తిచెందాడు. శ్రీనివాసరావు 2018 నుంచి అద్దంకి పట్టణంలో మున్సిపల్‌ కాంట్రాక్టర్‌గా పనులు చే స్తున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.2 కోట్ల బ కాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. మ ధ్య తరగతి కుటుంబం కావటంతో తన వద్ద ఉ న్న నగదుతో పాటు పెద్ద మొత్తంలో అప్పులు తె చ్చి గత ప్రభుత్వ హయాంలో పనులు చేశారు. అప్పులకు వడ్డీలు పెరగటంతో శ్రీనివాసరావు తరచూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని తోటి కాంట్రాక్టర్‌లతో చెబుతుండేవారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం దర్శిలోని స్వ గృహంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉ న్నారు. శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకు న్న అద్దంకి మున్సిపల్‌ కాంట్రాక్టర్‌లు నర్రా శ్రీనివాసరావు, సంజీవరెడ్డి, నాదెండ్ల సుబ్బారావు, అంకమ్మరావు,  బత్తుల వీరాంజనేయులు తదితరులు శ్రీనివాసరావు మృతదేహాన్ని సందర్శించి  నివాళులర్పించారు.  ప్రభుత్వం నుంచి బకాయి లు రాకపోవడంతో అద్దంకిలో పనులు చేసిన మి గిలిన కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.


నగర పంచాయతీలో రూ.10 కోట్ల బకాయిలు


అద్దంకి నగరపంచాయతీలో వివిధ పనులకు సంబంధించి సుమారు రూ.10 కోట్ల మేర బకాయిలు కాంట్రాక్టర్‌లకు చెల్లించాల్సి ఉంది. దీంతో మిగిలిపోయిన పనులు చేసేందుకు కూడా  ము ందుకు రావటం లేదు. ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడితో కొన్ని పనులను మాత్రం బలవంతంగా చేస్తున్నారు. ఈ నేపఽథ్యంలో రావాల్సిన బకాయి లు, తెచ్చిన అప్పుల గురించి తలచుకుంటేనే భ యమేస్తున్నదని  మున్సిపల్‌  కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


Updated Date - 2021-11-27T06:19:48+05:30 IST