కాంట్రాక్టర్లు ముందుకు రాక.. మురుగుతున్న నిధులు

ABN , First Publish Date - 2022-05-24T06:25:49+05:30 IST

వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల హయాంలో గ్రామా ల అభివృద్ధి పడకేసింది. నిధులున్నా నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం మొండికే స్తుండడంతో, పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లే దు. ఈ దుస్థితిలోనే మండలంలోని శాసనకోట-బాలరెడ్డిపల్లి రోడ్డు నిర్మాణం అటకెక్కింది.

కాంట్రాక్టర్లు ముందుకు రాక.. మురుగుతున్న నిధులు
శాసనకోట - బాలరెడ్డిపల్లి రోడ్డు దుస్థితి

  శాసనకోట - బాలరెడ్డిపల్లి రోడ్డుకు రూ.60 లక్షలు మంజూరు  

  రెండేళ్లుగా పడకేసిన నిర్మాణ పనులు


పరిగి, మే 23: వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల హయాంలో గ్రామా ల అభివృద్ధి పడకేసింది. నిధులున్నా నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం మొండికే స్తుండడంతో, పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లే దు. ఈ దుస్థితిలోనే మండలంలోని శాసనకోట-బాలరెడ్డిపల్లి రోడ్డు నిర్మాణం అటకెక్కింది. ఈ రెండు గ్రామాల 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 2021లో రూ.60 లక్షల నిధులను పంచాయతీ రాజ్‌ శాఖ మంజూరు చేసింది. ఆ వెంటనే అధికారులు రోడ్డు ప నులకు టెండర్లను ఆహ్వానించారు. ఏఒక్క కాంట్రాక్టరూ పనులు చేసేందుకు ముందుకు రాలేదు. మళ్లీ ఏకంగా వరుసగా ఐదుసా ర్లు టెండర్లకు ఆహ్వానించినా, కాంట్రాక్టర్లు ఈ పనులు మాకొద్దు బాబోయ్‌ అంటూ మిన్నకుండిపోయారు. దీంతో శాసనకోట-బాల రెడ్డిపల్లి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాకుండాపోయాయి. మంజూరైన నిధులేమో ప్రభుత్వ ఖజానాలో మురుగుతున్నాయి. 


గుంతల రోడ్డులో ఎన్నేళ్లిలా?

శాసనకోట-బాలరెడ్డిపల్లి గ్రామాల రోడ్డు ఏళ్లకాలంగా మట్టి రో డ్డుగానే మిగిలిపోయింది. నిధులు మంజూరయ్యాయని, కొత్త రో డ్డు నిర్మిస్తారని ఆశపడ్డ గ్రామస్థులకు కలగానే మిగిలిపోయింది. మోకాలిలోతు రోడ్డు గుంతల్లో ప్రయాణం సాగలేక, ప్రమాదాలను కొనితెచ్చుకోలేక నిట్టూరుస్తున్నారు. ఇక వర్షాకాలంలో ఈరోడ్డుపై అడుగేయలేని దుస్థితి. ఎద్దులబండ్లు, వాహనాల రాకపోకలకు తీ వ్ర ఆటంకం ఎదురవుతోంది. వాహన చక్రాలు బురదలో ఇరుక్కు పోతూ అష్టకష్టాలు పడుతున్నారు.


పంట ఉత్పత్తుల తరలింపునకూ అవే కష్టాలు

శాసనకోట, బాలరెడ్డిపల్లి గ్రామాలు వ్యవసాయంలో దిట్ట. ఇక్క డి రైతులు పండించిన పంట ఉత్పత్తులు మార్కెట్‌కు తరలించేం దుకు వారి బాధ వర్ణనాతీతం. ఈ గ్రామాలు మండలకేంద్రమైన పరిగికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ, నియోజకవర్గ కేంద్ర మైన హిందూపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే వున్నాయి. ఈ గ్రామాల నుంచి పంట ఉత్పత్తులను ఆయా కేంద్రాలకు తర లించాలంటే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. 


 ఇక అనారోగ్యం బారిన పడినప్పుడు ఆస్పత్రులకు చేరుకోవాల న్నా, అంబులెన్స రావాలన్నా నరకం చూస్తున్నారు. ఇంతటి దయనీయస్థితిలో ఈ రెండు గ్రామాల ప్రజలకు రోడ్డు నిర్మాణం కోసం ఎదురుచూపులే మిగిలాయి. సకాలంలో బిల్లులు చెల్లించని ప్రభుత్వ వైఖరికి తోడు.. అధికార పార్టీ నాయకుల కమీషన్ల కక్కుర్తితో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు జంకుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ పరిణామాలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కనుచూపు మేర కానరాకుండా పోతున్నాయి. ప్రజలకు కష్టాలే మిగులుతున్నాయి.

ఈ విషయమై పంచాయతీరాజ్‌ శాఖ జేఈ రామక్రిష్ణను వివర ణ కోరగా, శాసనకోట-బాలరెడ్డిపల్లి గ్రామాల రోడ్డు నిర్మాణ పనుల కు ఇప్పటికే ఐదుసార్లు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. కాంట్రాక్ట ర్లు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఉన్నతాధికారులతో చర్చించి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.


గుంతల రోడ్డులో పడిలేస్తూ ప్రయాణిస్తున్నాం...

 - నాసీర్‌, ప్రయాణికుడు 

హిందూపురం, పరిగికి వెళ్లాలంటే ఈ గుంతలో రోడ్డులో పడిలేస్తూ ప్రయాణిస్తు న్నాం. ఏళ్లకాలంగా మాకు ఈదుస్థితి తప్ప డం లేదు. చిన్నపాటి వర్షానికే రోడ్డంతా బురమయంగా మారి ప్రయాణం చేయలేకపోతున్నాం. అధికారులు స్పందించి వెం టనే రోడ్డు నిర్మాణం చేపట్టాలి.


వర్షం పడితే ద్విచక్రవాహనాలు కదలలేవు.. 

 శేషగిరిరెడ్డి, బాలరెడ్డిపల్లి  

చిన్నపాటి వర్షం కురిస్తేనే ఈ రోడ్డులో కనీసం ద్విచక్రవాహనం  కూడా వెళ్లలేని పరిస్థితి. ఎవరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్స రావడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. నిధులున్నా రోడ్డు నిర్మించకపోవడంతో అవస్థలు పడుతు న్నాం. అధికారులు చర్యలు తీసుకోవాలి.



Updated Date - 2022-05-24T06:25:49+05:30 IST