అభివృద్ధికి సహకరించండి

ABN , First Publish Date - 2021-04-23T05:46:20+05:30 IST

పట్టణ అభివృద్ధికి వర్తక, వ్యాపారస్తులు సహకరించాలని మున్సిపల్‌ చైర్మ న్‌ ఈశ్వర్‌ విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధికి సహకరించండి
వీధి వ్యాపారులతో మాట్లాడుతున్న చైర్మన్‌ ఈశ్వర్‌

నిర్మల్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 22 : పట్టణ అభివృద్ధికి వర్తక, వ్యాపారస్తులు సహకరించాలని మున్సిపల్‌ చైర్మ న్‌ ఈశ్వర్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం బస్టాండ్‌ ప్రాం తంలో షాపు యజమానులు, వర్తకులతో ఆయన మా ట్లాడారు. శివాజీచౌక్‌ నుండి గాజులపేట్‌ వరకు చేప ట్టిన రోడ్డు వెడల్పు పనులు పరిశీలించారు. పనులకు ఆటంకంగా ఉన్న షెడ్లు తొలగించాలని కోరారు. నిర్మల్‌ పట్టణ సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావా లని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధ వహిస్తూ నిధులు కేటాయించేందుకు కృషి చేస్తున్నా రని పేర్కొన్నారు. కమిషనర్‌ బాలకృష్ణ, ఏఈ వినయ్‌, టీపీవో సుమలత, కౌన్సిలర్లు చావుస్‌, నరేందర్‌, తది తరులు పాల్గొన్నారు. 

కొవిడ్‌ టీకా సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలు కొవిడ్‌టీకా తీసుకుని కరోనా బారిన పడ కుండా ఉండాలని మున్సి పల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ కోరారు. గురువారం చింతకుంటవాడలోని మున్నూరుకాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించే టీకా సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. కోవిడ్‌ టీకా కొరత లేకుండా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించా లని, భౌతికదూరం పాటించాలని కోరారు. సమర్థ వంతంగా ఎదుర్కోవాలని కోరారు. కౌన్సిలర్లు గండ్రత్‌ రమణ, లక్కాకుల నరహరి, నాయకులు అడప పోశె ట్టి, ప్రజలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-23T05:46:20+05:30 IST