‘సారా నియంత్రణకు సహకరించండి’
ABN , First Publish Date - 2022-05-29T06:02:34+05:30 IST
ఏజెన్సీలో సారా తయారీ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఈబీ ఏసీ కె.శ్రీనివాసరావు అన్నారు. కొండలోగాం గ్రామంలో శనివారం పోలీసులు, సచివాలయ సిబ్బంది, గిరిజనులతో కలిసి పరివర్తన 2.0 సమావేశం నిర్వహించారు.
హరిపురం: ఏజెన్సీలో సారా తయారీ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఈబీ ఏసీ కె.శ్రీనివాసరావు అన్నారు. కొండలోగాం గ్రామంలో శనివారం పోలీసులు, సచివాలయ సిబ్బంది, గిరిజనులతో కలిసి పరివర్తన 2.0 సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సారాతో కలిగే నష్టాలను వివరించారు. తయారీ, అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్ఈబీ సీఐ వెంకటప్పలనాయుడు, సోంపేట సీఐ రవిప్రసాద్, ఎస్ఐ సందీప్‌కుమార్ పాల్గొన్నారు.