తరచూ కోపం వస్తోందా.. తగ్గించుకోవాలంటే ఇలా చేసి చూడండి..

ABN , First Publish Date - 2021-10-12T17:30:47+05:30 IST

కొవిడ్‌ పాండమిక్‌ ఉధృతి తగ్గినా, ఎల్లప్పుడూ అప్రమత్తతతో వ్యవహరించవలసిరావడం, స్వేచ్ఛగా, నిర్భయంగా జనసమ్మర్థ ప్రదేశాలకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఆ ప్రభావం మనసు మీద కచ్చితంగా పడుతుంది. ఫలితంగా భావోద్వేగాలు అదుపు

తరచూ కోపం వస్తోందా.. తగ్గించుకోవాలంటే ఇలా చేసి చూడండి..

ఆంధ్రజ్యోతి(12-10-2021)

మానసికం  

కొవిడ్‌ పాండమిక్‌ ఉధృతి తగ్గినా, ఎల్లప్పుడూ అప్రమత్తతతో వ్యవహరించవలసిరావడం, స్వేచ్ఛగా, నిర్భయంగా జనసమ్మర్థ ప్రదేశాలకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఆ ప్రభావం మనసు మీద కచ్చితంగా పడుతుంది. ఫలితంగా భావోద్వేగాలు అదుపు తప్పడం సహజం. హద్దుమీరే కోపతాపాలు, చీకాకులు అనుబంధాలను బలహీనపరచకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి.


శ్వాస:

దీర్ఘ శ్వాస కండరాలు, నాడులు నెమ్మదించేలా చేస్తుంది. కోపం వచ్చినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం అలవాటు చేసుకోవాలి. అలాగే కొద్దిసేపు నడవాలి. నడకతో కండరాలు రిలాక్స్‌ అవడంతో పాటు, ఆ సందర్భం కోపం తెచ్చుకోవడానికి తగినదేనా? అని మనల్ని మనం తరచి చూసుకునే సమయమూ చిక్కుతుంది. 


మాటల మంత్రం:

ఆవేశంలో ఆలోచనలను పరుగులు తీస్తున్నప్పుడు, పరిష్కారం కనిపించదు. దాంతో కోపానికి లోనవుతాం. ఆ సమయంలో మాటలతో లౌక్యంగా కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ‘ఇప్పుడేమైందని కోపం తెచ్చుకోవాలి? అంతా సర్దుకుంటుంది’ అనో, ‘కోపం తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది?’ అనో, ‘రిలాక్స్‌’, టేకిట్‌ ఈజీ... ఇలా మాటల మంత్రంతో కోపాన్ని చల్లార్చాలి.


సంగీతం:

శ్రావ్యమైన సంగీతం, మనసును ఉల్లాసపరిచే సాహిత్యం కచ్చితంగా స్వాంతనను అందిస్తాయి. కాబట్టి కోపం చల్లారాలంటే సంగీతం వినాలి.


స్ట్రెచింగ్‌:

కోపంలో కండరాలు బిగదీసుకుంటాయి. కాబట్టి స్ట్రెచింగ్‌తో పాటు, కీళ్లు రిలాక్స్‌ అయ్యే ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.


మాట్లాడాలి:

కోపాన్ని వ్యక్తం చేయడం మంచిదే! దాని వల్ల మనసులోని ఒత్తిడి తొలగిపోతుంది. అయితే కోపాన్ని అరుపులు, కేకలతో కాకుండా తెలివిగా, అర్థవంతమైన చర్చ రూపంలో వెళ్లగక్కాలి. ఇందుకోసం కోపానికి కారణమైన అంశం గురించి స్నేహితులతో ఉపయోగకరమైన చర్చ కొనసాగించవచ్చు.


Updated Date - 2021-10-12T17:30:47+05:30 IST