కొలెస్ట్రాల్‌ తగ్గాలంటే..!

ABN , First Publish Date - 2021-04-10T16:51:12+05:30 IST

కొలెస్ట్రాల్‌ పెరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. ఆహార, జీవనశైలిలో కొన్ని మార్పులతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అదెలాగంటే

కొలెస్ట్రాల్‌ తగ్గాలంటే..!

ఆంధ్రజ్యోతి(10-04-2021)

కొలెస్ట్రాల్‌ పెరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. ఆహార, జీవనశైలిలో కొన్ని మార్పులతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అదెలాగంటే...


కొలెస్ర్టాల్‌ని తగ్గించుకోవడాన్ని ఒక ఛాలెజింగ్‌గా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒక్కరే వ్యాయామం చేయాలంటే బోర్‌గా ఫీలవుతారు. అందుకే స్నేహితులతో కలిసి వెళ్లాలి. వాకింగ్‌కు వెళ్లడం వాయిదా వేయొద్దు. రోజుకు కనీసం అరగంటపాటు వేగంగా నడవాలి. 


స్నేహితులతో కలిసి కాసేపైనా మనసారా నవ్వుకోవాలి. ఒత్తిడి తగ్గితే గుండెకు చాలా మంచిది. కాబట్టి ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి.


షుగర్స్‌, ఇతర పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. దాంతో కొలెస్ట్రాల్‌ ఎక్కువవుతంది. సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.  అలాగే ఫ్రక్టోజ్‌ తీపి పదార్థం ఎక్కువగా ఉండే పదార్థాలను తినకూడదు.


కొలెస్ర్టాల్‌ నియంత్రణలో ఉండాలంటే ఆహారంలో తగినంత ఫైబర్‌ ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు రోజూ తినాలి. 


చేపలలో లభించే డైహైడ్రాక్సీ ఎసిటోన్‌ (డీఎచ్‌ఎ) మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తుంది. కాబట్టి వారంలో ఒకరోజు సీ ఫుడ్‌ తినేలా ప్లాన్‌ చేసుకోవాలి. శాకాహారులు ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్లను తీసుకోవచ్చు. 


వేపుడు పదార్థాలు తినడం బాగా తగ్గించాలి. బంగాళదుంప వేపుడు, చిప్స్‌లాంటివి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వాటిని తినకూడదు.

Updated Date - 2021-04-10T16:51:12+05:30 IST