హత్యా రాజకీయాలను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-08-10T06:21:09+05:30 IST

నియోజకవర్గంలో ఎస్సీ, బీసీలపై జరుగుతున్న వైసీపీ హత్యారాజకీయాలను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ విజ్ఞప్తి చేశారు.

హత్యా రాజకీయాలను అరికట్టాలి
బాధితులకు మద్దతు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి

  • మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌

రాజానగరం, ఆగస్టు 9: నియోజకవర్గంలో ఎస్సీ, బీసీలపై జరుగుతున్న వైసీపీ హత్యారాజకీయాలను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడడం పరిపాటిగా మారిందన్నారు. రాజా నగరానికి చెందిన గొంతిన సూరిబాబుపై హత్యాయత్నం చేసిన వారిని తక్ష ణమే అరెస్టు చేయాలని కోరుతూ బాధితులు సానిక గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద మంగళవారం చేపట్టిన నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పెందుర్తి మాట్లాడుతూ వైసీపీ పాలనలో సామాన్యులపై దాడు లు రోజు రోజుకు పెచ్చుమీరిపోతున్నాయన్నారు. సోషల్‌ మీడియాలో సైతం నీచమైన దాడులు చేస్తున్నారని దీనిని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోందన్నారు. రాజానగరంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించిన సూరిబాబుపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అలాగే సీతానగరంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన ప్రసాద్‌పై దాడి చేసి శిరోముండనం చేశారన్నారు. అదేవిధంగా రైతులకు జరుగుతున్న అన్యా యంపై పోరాడుతున్న ఎస్సీ లెక్చరర్‌పై దాడి చేసిన ఘటనలు గుర్తుచేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే దిశగా అధికారులు చర్యలు  చేపట్టాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గంగిశెట్టి చంటిబాబు పాటు నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు నీలపాల అరవరాజు, చిట్టిప్రోలు పద్దరాజు, సోడసాని త్రిమూర్తులు, పిల్లా రాజబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T06:21:09+05:30 IST