‘ఫీజుల దోపిడీని అరికట్టాలి’

ABN , First Publish Date - 2021-05-11T05:38:14+05:30 IST

జిల్లాలో కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని సీపీఐ కర్నూలు నగర కార్యదర్శి పి.గోవిందు కోరారు.

‘ఫీజుల దోపిడీని అరికట్టాలి’

కర్నూలు(హాస్పిటల్‌), మే 10: జిల్లాలో కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని సీపీఐ కర్నూలు నగర కార్యదర్శి పి.గోవిందు కోరారు. సోమవారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్‌  జీ.వీరపాండియన్‌కు వినతి పత్రం అందించారు. కర్నూలులో చిన్న పడకల ప్రైవేటు హాస్పిటల్‌ నుంచి కార్పొరేట్‌ హాస్పిటల్‌ వరకు కరోనా వైరస్‌ సోకినా బాధితుల నుంచి రోజుకు రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు.  ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు  ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు. అధిక ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-05-11T05:38:14+05:30 IST