రాత్రివేళ ప్రమాదంలో ఉన్న మహిళకు సాయం చేసిన వ్యాపారి.. లక్షలు చెల్లించాలని వ్యాపారికి బెదిరింపులు.. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-01-28T05:34:49+05:30 IST

ఒక వ్యాపారి రాత్రివేళ ఇంటికి వెళుతున్న దారిలో ఒక మహిళ ఎదురుపడి తనకు సహాయం చేయాలని ప్రాధేయపడింది. ఆమెకు కొంచెం డబ్బు సహాయం చేసి అతను వెళ్లిపోయాడు. ఆ తరువాత వారిద్దరూ మళ్లీ కలిశారు. అలా వారి మధ్య అక్రమ సంబంధం...

రాత్రివేళ ప్రమాదంలో ఉన్న మహిళకు సాయం చేసిన వ్యాపారి.. లక్షలు చెల్లించాలని వ్యాపారికి బెదిరింపులు.. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..

ఒక వ్యాపారి రాత్రివేళ ఇంటికి వెళుతున్న దారిలో ఒక మహిళ ఎదురుపడి తనకు సహాయం చేయాలని ప్రాధేయపడింది. ఆమెకు కొంచెం డబ్బు సహాయం చేసి అతను వెళ్లిపోయాడు. ఆ తరువాత వారిద్దరూ మళ్లీ కలిశారు. అలా వారి మధ్య అక్రమ సంబంధం మొదలైంది. ఆ తరువాత ఏం జరిగిందంటే..


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్రంలోని ఢోల్‌పూర్‌కు చెందిన ఒక సిమెంట్ వ్యాపారి ధనీరామ్(55, పేరు మార్చబడినది) ఒక రోజు రాత్రి తన ఇంటికి వెళుతున్న దారిలో కామిని(40, పేరు మార్చబడినది) అనే మహిళ ఎదురుపడింది. తన బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని కాపాడడానికి రూ.2,000 కావాలని ఇచ్చి సహాయం చేయమని కోరింది. మళ్లీ డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. ఆమె మాటలు వినన ధనీరామ్ రూ.2,000 ఇచ్చాడు. ఆ తరువాత ఇద్దరూ ఒకరి మొబైల్ నెంబర్ మరొకరు షేర్ చేసుకున్నారు. 


కొన్ని రోజుల తరువాత కామిని.. ధనిరామ్‌కు ఫోన్ చేసి ఒకచోటకు వచ్చి డబ్బు తీసుకోమని చెప్పింది. అక్కడకి ధనీరామ్ వెళ్లగా.. కామిని అతని ముందు నగ్నంగా నిలబడింది. ధనీరామ్ ఆమె అందానికి దాసుడయ్యాడు. అలా వారిద్దరి మధ్య అక్రమ సంబంధం మొదలైంది. ఒకరోజు కామిని ఇంట్లో శృంగారం చేసుకుంటుండగా.. కామిని ఇంటి యజమాని కొడుకు అక్కడికి వచ్చాడు. ఆ స్థితిలో ఉన్న వారిద్దరి వీడియోను రహస్యంగా తీశాడు. ఆ తరువాత ధనీరామ్‌కు వీడియో చూపించి రూ.4 లక్షలు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశాడు. 


అది చూసి కంగారు పడిన ధనీరామ్.. అతనికి రెండు సార్లు లక్ష రూపాయలు చొప్పున రూ.2 లక్షలు చెల్లించాడు. కానీ ఆ తరువాత కూడా ఆ మోసగాడు ధనీరామ్‌కి ఎక్కువ డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చూస్తూనే ఉన్నాడు. ఈ చిత్రహింసలు భరించలేని ధనీరామ్ పోలీసులను ఆశ్రయించాడు. వారికి జరిగినదంగా వివరించి చెప్పాడు. 


పోలీసులు ధనీరామ్ ఫిర్యాదుపై కామిని, ఆమె ఇంటి యజమాని గురించి విచారణ చేశారు. వారి దర్యాప్తు ఈ బ్లాక్ మెయిలింగ్ వెనుక కామిని మాస్టర్ మైండ్ అని తేలింది. పోలీసులు ఇంటి యజమాని కొడుకుని అరెస్టు చేశారు. కామిని పోలీసులు వెతుకుతున్నారని తెలిస పరారైంది. ప్రస్తుతం పోలీసులు ఆమెకోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-01-28T05:34:49+05:30 IST