భూ సేకరణకు సహకరించండి

ABN , First Publish Date - 2022-05-26T05:20:07+05:30 IST

మదనపల్లె మండలం పోతబోలు వద్ద నిర్మిస్తున్న 3,800 ఇళ్ల లేఅవుట్‌కు వెళ్లేందుకు ప్రధాన రహదారి నుంచి దగ్గర దారి కోసం భూసేకరణ చేయను న్నట్లు ఆర్డీవో ఎంఎస్‌ మురళి తెలిపారు.

భూ సేకరణకు సహకరించండి
రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో మురళి

మదనపల్లె టౌన, మే 25: మదనపల్లె మండలం పోతబోలు వద్ద నిర్మిస్తున్న 3,800 ఇళ్ల లేఅవుట్‌కు వెళ్లేందుకు ప్రధాన రహదారి నుంచి దగ్గర దారి కోసం భూసేకరణ చేయను న్నట్లు ఆర్డీవో ఎంఎస్‌ మురళి తెలిపారు. బుధవారం స్థానిక సబ్‌ కలెక్టరేట్‌లో పోత బోలు, బసినికొండ, వెంకప్పకోట గ్రామాలకు చెందిన 26 మంది రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడు తూ సీటీఎం రోడ్డులోని టిడ్కో ఇళ్ల నుంచి పోతబోలు లేఅవుట్‌కు  60 అడుగుల వెడ ల్పుతో రహదారి ఏర్పాటుకు 6.26 ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. ఈ భూముల రిజిసే్ట్రషన విలువకు రెట్టింపు విలువను పరి హారంగా చెల్లిస్తామన్నారు. ఈ మార్గంలో రహ దారి నిర్మిస్తే ఇరువైపులా ఉన్న భూముల విలువ పెరుగుతుందన్నారు. రైతు లు అర్థం చేసుకుని భూసేకరణకు సహకరిం చాలని కోరారు. రైతులు మాట్లాడుతూ తమకు గిట్టుబాటు పరిహారం ఇస్తే భూమి అప్పగిస్తా మన్నారు. తహసీల్దార్‌ సీకే శ్రీనివాసులు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T05:20:07+05:30 IST