జూన్‌లో ‘సహకార’ భేరి!

ABN , First Publish Date - 2021-03-06T08:25:47+05:30 IST

సహకార సంఘాలకు జూన్‌ నెలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం తాత్కాలికంగా తేదీలను ఖరారుచేసింది

జూన్‌లో ‘సహకార’ భేరి!

రెండు దశల్లో ఎన్నికలు

జూన్‌ 13 నుంచి నామినేషన్లు

జూన్‌ 21, 24 తేదీల్లో పోలింగ్‌

తాత్కాలికంగా ఖరారుచేసిన ప్రభుత్వం


భీమవరం, మార్చి 5: సహకార సంఘాలకు జూన్‌ నెలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం తాత్కాలికంగా తేదీలను ఖరారుచేసింది. రెండు విడతల్లో.. 21, 24 తేదీల్లో ఎన్నికలు జరపాలని భావిస్తోంది. సహకార ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తొలి దశలో మే 15న, రెండో దశలో మే 18వ తేదీన ఎన్నికల అధికారుల నియామకంతో సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. జూన్‌ 13 నుంచి నామినేషన్ల దాఖలు మొదలవుతుందని.. ఆ నెల 25నాటికి ఎన్నికైన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. ్గరాష్ట్రవ్యాప్తంగా 2,051 సహకార సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ ఏడాదిన్నర కాలంగా త్రిసభ్య కమిటీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయు. సదరు కమిటీలను ప్రభుత్వం గత నెలలో రద్దు చేసి.. ప్రత్యేక అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. సహకార ఎన్నికలు ఇంకెప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించిన దరిమిలా.. మూడ్రోజుల కింద జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2021-03-06T08:25:47+05:30 IST