స్కూల్ ప్రిన్స్‌పాల్‌ని మోసం చేసిన పోలీస్ ఫ్యామిలీ.. 10 లక్షలు కాజేసారంటూ ఫిర్యాదు.. నిజానికి ఆ దొంగ పోలీస్ ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-11-26T11:56:22+05:30 IST

ఒక స్కూల్ ప్రిన్సిపాల్(ప్రధాన ఉపాధ్యాయురాలు)గా పనిచేస్తున్న ఆమెకు అతడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రోజూ ఆమె చేసే కామెంట్స్‌ని లైక్స్ కొడుతూ ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆ తరువాత ఆమెతో కలిసి ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మూడేళ్లుగా ఆమె ఇంట్లోనే సహజీవనం చేస్తూ.. ఆమె వద్ద డబ్బు, నగలు కాజేశాడు...

స్కూల్ ప్రిన్స్‌పాల్‌ని మోసం చేసిన పోలీస్ ఫ్యామిలీ.. 10 లక్షలు కాజేసారంటూ ఫిర్యాదు.. నిజానికి ఆ దొంగ పోలీస్ ఏం చేశాడంటే..

ఒక స్కూల్ ప్రిన్సిపాల్(ప్రధాన ఉపాధ్యాయురాలు)గా పనిచేస్తున్న ఆమెకు అతడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రోజూ ఆమె చేసే కామెంట్స్‌ని లైక్స్ కొడుతూ ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆ తరువాత ఆమెతో కలిసి ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మూడేళ్లుగా ఆమె ఇంట్లోనే సహజీవనం చేస్తూ.. ఆమె వద్ద డబ్బు, నగలు కాజేశాడు. ఆ తరువాత పెళ్లి మాటెత్తితే చాలు గొడవ చేసేవాడు. గొడవలలో మధ్యవర్తిత్వం చేయడానికి అతని తమ్ముడు వచ్చాడు. ఆ తమ్ముడు కూడా ముందు ఆమెను బెదిరించాడు.. తన అన్ననే ఒక పోలీస్ అని ఆమెను ఏదో ఒక కేసులో ఇరికించి గలమని చెప్పాడు. ఆ పోలీస్‌కు ఇంతకుముందే వివాహమైందని తెలిసి.. ఆమె చివరికి ధైర్యం చేసి తనని మోసం చేసిన వారిపై పోలీసలకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ నగర సమీపంలోని ఒక గ్రామంలో జరిగింది.


కాన్పూర్ సమీపంలోని తాల్‌గ్రామ్ అనే గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో సరళా దేవి(31, పేరు మార్చబడినది) ప్రధాన ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు 2018 సంవత్సరంలో ఫేస్‌బుక్ ద్వారా జస్వంత్ సింగ్ (34) పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ ఆమె ఇంట్లోనే సహజీవనం చేస్తున్నారు. జస్వంత్ సింగ్ ఒక పోలీస్ కాన్సటేబుల్‌ ఉద్యోగం చేస్తున్నాడు. 


సరళ దేవిని పెళ్లి చేసుకుంటానని జస్వంత్ సింగ్ నమ్మించాడు. ఈ మూడేళ్లలో తనకు అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి సరళ పేరు మీద రూ.10 లక్షల బ్యాంకు లోన్ తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఆమె వద్దనున్న నగలు కూడా తీసుకున్నాడు. ఆ తరువాత నుంచి ఆమెను పట్టించుకోవడం మానేశాడు. పెళ్లిప్పుడంటే గొడవ పడేవాడు. చివరికి అతడిని నిలదీసిన సరళను జస్వంత్ బెదిరించాడు. వారిద్దరి మధ్య శృంగారాన్ని వీడియో తీశానని అది ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తానని చెప్పాడు. ఆమె అతడిపై పోలీసు కేసు పెడతానని చెప్పగా.. జస్వంత్ తన తమ్ముడు అమర్జీత్‌ని తీసుకువచ్చాడు.




అమర్జీత్ ఒక పేరు మోసిన రౌడీ. జస్వంత్‌కు ఇంతకు ముందే పెళ్లి అయిందని అతను సరళతో వివాహం చేసుకోలేడని చెప్పాడు. సరళ గురించి జస్వంత్ మొదటి భార్య శివానికి అంతా తెలిసినా అమె ఎలా గొడవ చేయకుండా ఉందో తను కూడా అలాగే ఉండాలని సరళకు అమర్జీత్ చెప్పాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఏదో ఒక నకిలీ కేసు బనాయించి ఇరికిస్తానని సరళను అమర్జీత్ బెదిరించాడు. సరళ అతను చెప్పినదానికి ఒప్పుకోకపోవడంతో.. అమర్జీత్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెను చంపేస్తానని బెదిరించాడు.


ఇంతజరిగినా.. సరళ ధైర్యం కూడ గట్టుకొని తనను మోసం చేసిన జస్వంత్ సింగ్, అతని తమ్ముడు అమర్జీత్, అతని భార్య శివానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల ఆమె చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-11-26T11:56:22+05:30 IST