మధ్యాహ్నం కాని సాయంత్రం కాని ఐదు నిమిషాల కోసం తన గదికి ఒంటరిగా రావాలని పోలీసు ఇన్స్పెక్టరు వివాహితను ఫోనులో కోరాడు. దానికి వివాహిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసు ఇన్స్పెక్టరు సాబీర్ ముహమ్మద్ సస్పెండ్ చేసి, శాఖ పరమైన దర్యాప్తునకు ఆదేశించామని సీనియర్ పోలీసు అధికారి శ్యాంసింగ్ చెప్పారు.