పొడి వనరుల సేకరణ కేంద్రం

ABN , First Publish Date - 2020-12-03T05:24:36+05:30 IST

పొడి వనరుల సేకరణ కేంద్రంతో బహుళ ప్రయోజనాలు అందుతున్నాయని మెట్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రమేశ్‌, ముజీబ్‌, ధర్మేందర్‌లు అన్నా రు.

పొడి వనరుల సేకరణ కేంద్రం
కంపోస్ట్‌ తయారీని పరిశీలిస్తున్న మెట్‌పల్లి మున్సిపల్‌ అధికారులు

మెట్‌పల్లి, డిసెంబరు 2: పొడి వనరుల సేకరణ కేంద్రంతో బహుళ ప్రయోజనాలు అందుతున్నాయని మెట్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రమేశ్‌, ముజీబ్‌, ధర్మేందర్‌లు అన్నా రు. బుధవారం మెట్‌పల్లి పట్టణంలోని పొడి వనరుల సేకరణ కేంద్రా న్ని వారు పరిశీలించారు. కేంద్రంలో కంపోస్ట్‌ తయారీ గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో  ప్రతినిత్యం తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నామన్నారు. సేకరిం చిన తడిచెత్తతో కంపోస్టు తయారు చేస్తుండడం జరుగుతుందన్నారు. దీనితో ప్రతినెలా మున్సిపల్‌కు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్‌ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:24:36+05:30 IST