ఓ ఇంట్లోంచి Help అంటూ అరుపులు వినిపిస్తున్నాయంటూ ఫోన్.. హుటాహుటిన వెళ్లిన పోలీసులకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-06-19T02:36:06+05:30 IST

వృద్ధ మహిళ సాయం కోసం కేకలు వేస్తోందన్న సమాచారం రావడంతో ఆమె ఇంటికి వెళ్లిన బ్రిటన్ పోలీసులకు ఊహించని సీన్ ఎదురైయ్యింది.

ఓ ఇంట్లోంచి Help అంటూ అరుపులు వినిపిస్తున్నాయంటూ ఫోన్.. హుటాహుటిన వెళ్లిన పోలీసులకు షాకింగ్ ట్విస్ట్..!

ఎన్నారై డెస్క్: వృద్ధ మహిళ సాయం కోసం కేకలు వేస్తోందన్న సమాచారం రావడంతో ఆమె ఇంటికి వెళ్లిన బ్రిటన్ పోలీసులకు ఊహించని సీన్ ఎదురైయ్యింది. హెల్ప్ అంటూ కేకలు వేస్తున్నది ఓ చిలక అని తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు. బర్మింగ్‌హామ్‌లోని వైల్డ్ గ్రీన్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లో వృద్ధ మహిళ సాయం కోసం అరుస్తోదంటూ స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తోసుకుని లోపలకు వెళ్లారు. 


అయితే.. ఇంట్లో ఎవరూ లేకపోగా.. ఎదురుగా హెల్ప్ అంటూ అరుస్తున్న చిలక కనిపించింది. దీంతో.. వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అదే సమయంలో.. ఇంట్లోకి వచ్చిన మహిళ కుమారుడు ఆ చిలకకు మాటలు వచ్చని చెప్పడంతో పోలీసులకు నోట మాట రాలేదు. అచ్చం మనిషిలా అరుస్తున్న చిలుకను చూసి పోలీసులతో పాటూ స్థానికులూ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని పోలీసులు ట్విటర్‌లో షేర్ చేయడంతో ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-06-19T02:36:06+05:30 IST