చెప్పులు రూ.6 లక్షలేంటని అవాక్కవుతున్నారా..? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటంటే..

Sep 27 2021 @ 02:48AM

రూ.6 లక్షల బ్లూటూత్‌ చెప్పులతో కాపీయింగ్‌

రాజస్థాన్‌లో హైటెక్‌ చీటింగ్‌


బికనీర్‌, సెప్టెంబరు 26: భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ స్థానానికి వెళ్లాల్సిన వారు అడ్డదారి తొక్కారు. రాజస్థాన్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఆర్‌ఈఈటీ) వేదికగా ముగ్గురు అభ్యర్థులు బ్లూటూత్‌ చెప్పులతో హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. బికనీర్‌ నగరంలోని గంగాషహర్‌ ఏరియా బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ ముఠా బండారం బయటపడింది. ఒక్కో జత బ్లూటూత్‌ చెప్పులను రూ.6 లక్షలు చొప్పున వివిధ జిల్లాలకు చెందిన 25 మంది ఆర్‌ఈఈటీ అభ్యర్థులకు విక్రయించామని వారు తెలిపారు. ముఠాకు సూత్రధారి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.