కృష్ణా: జిల్లాలోని నూజివీడు మండలం సిద్ధార్థనగర్ తండాల్లో ఎస్ఈబీ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మామిడి తోటల్లో, అడవి బిట్లలో ముమ్మర తనిఖీలు చేసారు. నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న 3,200 లీటర్ల బెల్లపు ఊటని ధ్వంసం చేసారు. 20 లీటర్ల సారాను ఎస్ఈబీ అధికారులు సీజ్ చేసారు.