కొత్తిమీర @ 150

ABN , First Publish Date - 2022-09-16T17:09:27+05:30 IST

కూరల రుచిని అమాంతం పెంచే కొత్తిమీర ధర రాజధాని బెంగళూరు(Bangalure)తో సహా పలు ప్రాంతాల్లో ఆకాశాన్నంటింది. ఇటీవలి భారీ

కొత్తిమీర @ 150

బెంగళూరు, సెప్టెంబరు, 15(ఆంధ్రజ్యోతి): కూరల రుచిని అమాంతం పెంచే కొత్తిమీర ధర రాజధాని బెంగళూరు(Bangalure)తో సహా పలు ప్రాంతాల్లో ఆకాశాన్నంటింది. ఇటీవలి భారీ వర్షాలే ఇందుకు కారణమని  మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తిమీర పంటను అధికంగా పండిస్తారు. సాధారణ రోజుల్లో చిన్న కట్ట 5 రూపాయలుగానూ పెద్దది 20 రూపాయలుగానూ ఉండేది. తాజాగా చిన్నకట్ట ధర రూ.60 పలుకుతుండగా, పెద్దకట్ట ధర ఏకంగా రూ.150గా ఉంది. పదిరూపాయలకు కొత్తిమీర దొరకడం లేదు. మరికొద్దిరోజుల పాటు కొత్తిమీర ధర ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. హోటళ్లలోనూ కొత్తిమీర వాడకం బాగా తగ్గింది.

Updated Date - 2022-09-16T17:09:27+05:30 IST