కొత్తిమీర పచ్చడి

ABN , First Publish Date - 2020-09-05T19:44:46+05:30 IST

కొత్తిమీర కట్ట - ఒకటి(పెద్దది), పచ్చిమిర్చి - ఎనిమిది, ఎండుమిర్చి - ఒకటి, నూనె - మూడు టీస్పూన్లు, ఆవాలు - అర స్పూన్‌, జీలకర్ర - అర స్పూన్‌, శనగపప్పు

కొత్తిమీర పచ్చడి

కావలసినవి: కొత్తిమీర కట్ట - ఒకటి(పెద్దది), పచ్చిమిర్చి - ఎనిమిది, ఎండుమిర్చి - ఒకటి, నూనె - మూడు టీస్పూన్లు, ఆవాలు - అర స్పూన్‌, జీలకర్ర - అర స్పూన్‌, శనగపప్పు - కొద్దిగా, మినప్పప్పు - కొద్దిగా, మెంతులు - ఆరు, ఇంగువ - కొద్దిగా, చింతపండు - నిమ్మకాయంత, బెల్లం - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - కొంచెం.


తయారీ విధానం: కొత్తిమీరను సన్నగా తరిగి బాగా కడిగి ఆర బెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలిపెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ వేసి వేగించాలి. తరువాత ఎండుమిర్చి వేసుకోవాలి. చివరన పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కాసేపు వేగించి దింపాలి. చింతపండు పోయాలి. చల్లారాక బెల్లం, పసుపు, ఉప్పు వేసుకుని గ్రైండ్‌ చేసుకోవాలి. గ్రైండ్‌ చేసే సమయంలో నీళ్లు పోయకూడదు. పోపు నూనెతోనే గ్రైండ్‌ చేసుకుంటే సరిపోతుంది.


వంద గ్రాముల కొత్తిమీరలో..

క్యాలరీలు - 23

కార్బోహైడ్రేట్లు - 3.7 గ్రా

డైటరీ ఫైబర్‌ - 2.8 గ్రా

ప్రొటీన్‌ - 2.1 గ్రా


ఇంకా క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం మైక్రోగ్రాముల్లో లభిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు కొత్తిమీరలో పుష్కలం. షుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తినిస్తుంది. గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది.




Updated Date - 2020-09-05T19:44:46+05:30 IST