కొత్తిమీర వడలు

ABN , First Publish Date - 2021-02-27T18:34:17+05:30 IST

సాయంత్రం వేళ జిహ్యచాపల్యాన్ని తీర్చే స్నాక్స్‌ తినాలనిపించడం సాధారణమే. అలాంటప్పుడు పోహా కట్‌లెట్స్‌, మూంగ్‌ దాల్‌ ఛాట్‌, కొత్తిమీర వడలు, రైస్‌ బాల్స్‌ను రుచి చూడండి. క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ స్నాక్స్‌ తయారీ విధానం ఇది...

కొత్తిమీర వడలు

కరకరలాడే స్నాక్స్‌

సాయంత్రం వేళ జిహ్యచాపల్యాన్ని తీర్చే స్నాక్స్‌ తినాలనిపించడం సాధారణమే. అలాంటప్పుడు  పోహా కట్‌లెట్స్‌, మూంగ్‌ దాల్‌ ఛాట్‌, కొత్తిమీర వడలు, రైస్‌ బాల్స్‌ను రుచి చూడండి.  క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ స్నాక్స్‌ తయారీ విధానం ఇది...


కావలసినవి: కొత్తిమీర - మూడు కట్టలు, సెనగపిండి - ఒకకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - ఒకటి, ధనియాల పొడి - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, నువ్వులు - ఒక టీస్పూన్‌, గరంమసాలా - పావు టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, నీళ్లు - పావు కప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి తరిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో సెనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, నువ్వులు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి, అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపాలి. మెత్తటి మిశ్రమంగా తయారుకావడం కోసం అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు అర చేతుల్లో కొద్దిగా నూనె రాసుకుని ప్లేట్‌లో సమంగా పరిచి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి. చల్లారిన తరువాత స్లైస్‌లుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక వాటిని వేసి వేగించాలి. అంతే... కరకరలాడే కొత్తిమీర వడలు రెడీ.



Updated Date - 2021-02-27T18:34:17+05:30 IST