కార్న్‌ దోశ

ABN , First Publish Date - 2020-07-25T17:29:02+05:30 IST

కార్న్‌ - మూడు కప్పులు, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - రెండు, మినప్పప్పు - పావుకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిప

కార్న్‌ దోశ

కావలసినవి: కార్న్‌ - మూడు కప్పులు, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - రెండు, మినప్పప్పు - పావుకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.


తయారీ: కార్న్‌, మినప్పప్పును అరగంటపాటు నానబెట్టాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత అందులో మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక దోశలు వేసి కాల్చాలి. దోశలపై నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చాలి. తరువాత చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-07-25T17:29:02+05:30 IST