Advertisement

కోరలు చాస్తున్న కరోనా

Apr 23 2021 @ 01:35AM

రోజుకు వెయ్యికి చేరువలో కేసులు

21 రోజుల్లో 10, 502 మంది బాధితులు

వారం రోజులుగా రోజూ 500కుపైనే

బుధవారం 989 మందికి వైరస్‌

అధికారిక లెక్కల ప్రకారమే

అనధికారికంగా అంతకు మించే


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి)

గ్రేటర్‌ హైదరాబాద్‌పై కరోనా దండెత్తుతోంది. వందల సంఖ్య నుంచి రోజుకు వేయికి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 గంటల్లో 989 మందికి వైరస్‌ సోకింది. ఈ నెలలో గడిచిన 21 రోజుల్లో 10,502 మంది వైరస్‌ బారిన పడ్డారు. 15  వ తేదీ నుంచి రోజుకు 500 పైనే కేసులు నమోదవుతూ వస్తున్నాయి. 18వ తేదీన 705 మందికి వైరస్‌ సోకగా 21 నాటికి ఆ సంఖ్య 989కి చేరింది. ఈ లెక్కలన్నీ అధికారికంగా మాత్రమే. అనధికారికంగా రెట్టింపు సంఖ్యలో ఉంటున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో రోజూ 9 వేల నుంచి 11 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో 25 శాతం మేరకు పాజిటివ్స్‌ వస్తున్నట్లు సమాచారం. సగటున రోజుకు 500 మంది వైరస్‌ బారిన పడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 


Follow Us on:
Advertisement