ఖతర్నాక్‌ కరోనా

ABN , First Publish Date - 2020-07-06T11:31:35+05:30 IST

ఖతర్నాక్‌ కరోనా ఉ మ్మడి పాలమూరును వణికిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుం డడం ప్రజలను భయాం దోళనలకు గురి చేస్తోంది.

ఖతర్నాక్‌ కరోనా

మహబూబ్‌నగర్‌/వనపర్తి (వైద్య విభాగం)/కందనూలు/గద్వాల క్రైం/ నారాయణపేట క్రైం, జూలై 5 : ఖతర్నాక్‌ కరోనా ఉ మ్మడి పాలమూరును వణికిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుం డడం ప్రజలను భయాం దోళనలకు గురి చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఆదివారం 20 కేసులు నమోదయ్యాయి. మహబూ బ్‌నగర్‌ జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జిల్లా కేంద్రంలోనే నమోదు కావడం గమనార్హం. అందులో సంజయ్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. అతడికి అక్కడే పాజిటివ్‌ వచ్చింది. టీడీ గుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళకు వైరస్‌ సోకడంతో ఉస్మానియాలో చికిత్స పొందుతోంది. రాంనగర్‌ ప్రాంతానికి చెందిన మరో మహిళకు కూడా పాజిటివ్‌ వచ్చింది. ఈమె వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య. సుభాష్‌ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముం టున్న తల్లి కూతుళ్లకు వైరస్‌ సోకింది. వైద్య, ఆరోగ్య శాఖలోని ఓ అధికారి తమ్ముడికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ఇతను పద్మావతి కాలనీకి చెందిన వ్యక్తి.


వనపర్తి జిల్లాలో ఆదివారం తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో పట్టణంలోనే ఐదు కేసులున్నాయి.  పట్టణం లోని రాయిగడ్డ కాలనీలో 53 సంవత్సరాల వృద్దుడు, బ్రహ్మంగారి వీధిలో 43 సంవత్సరాల వ్యక్తి, నందిహిల్స్‌ కాలనీలోని 62 సంవత్సరాల వృద్దుడు, భగీరథ కాలనీలో 40 ఏళ్ల వ్యక్తి, 42 ఏళ్ల మహిళ కరోనా బారిన పడ్డారు. కొత్తకోటలో 40 సంవత్సరాల వ్యక్తి ఒకరు కాగా, 50 సంవత్సరాల వృద్ధుడు, 24 సం వత్సరాల యువకు డికి కరోనా పాజి టివ్‌గా తేలింది. పెద్దమందడి మం డలంలోని మద్దిగట్ల గ్రామంలో 62 సంవత్సరాల వృద్ధురాలు కరోనా బారిన పడింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 523 శ్యాంపిల్స్‌ తీసిన అధికారులు, 39 కేసులు నమోదు అయినట్లు గుర్తించారు. వారిలో ఆదివారం డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలియజేశారు.


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయి నట్లు డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్వకుర్తి ప్రభుత్వా స్పత్రిలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్‌నర్సుకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తిమ్మాజిపేట మండలం గుమ్మకొండకు చెందిన వ్యక్తికి, నాగర్‌కర్నూల్‌ పట్టణానికి చెందిన మరో వ్యక్తికి  కరోనా సోకింది. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్‌ భీంనాయక్‌ తెలిపారు.


నారాయణపేట మండలంలోని సింగారం గ్రామానికి చెందిన ఓ యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డీఎం అండ్‌ హెచ్‌ఓ జయచంద్రమోహన్‌ తెలిపారు. గ్రామానికి చెందిన 68 ఏళ్ల వ్యక్తి కరోనాతో ఇటీవలే మృతిచెందాడు. ఆయన కుటుం బంలోని నలుగురికి పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Updated Date - 2020-07-06T11:31:35+05:30 IST