తగ్గని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-09-07T10:58:05+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి రోజు రోజుకూ పెరుగుతునే ఉంది. వైరస్‌ వ్యాప్తితో పాటు మృతుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండడంతో జిల్లా

తగ్గని కరోనా ఉధృతి

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు

6 వేలకు పైగానే కేసుల నమోదు            

మృతుల సంఖ్యా పెరుగుతున్న వైనం

చిన్నపాటి జ్వరం వచ్చినా వణికే పరిస్థితి

కరోనా కాలంలో అందరిలోనూ అయోమయం

అన్ని వర్గాల ప్రజల్లోనూ గుబులే


కామారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 6: జిల్లాలో కరోనా ఉధృతి రోజు రోజుకూ పెరుగుతునే ఉంది. వైరస్‌ వ్యాప్తితో పాటు మృతుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండడంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే వైరస్‌ బారిన పడిన వారి సంఖ్యతో పాటు రికవరి అవుతున్న వారి సం ఖ్య కూడా భారీగానే ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటు న్నాయి. గతంలో కంటే ప్రస్తుతం పరీక్షల సంఖ్య పెంచడం తో పాజిటివ్‌ వచ్చిన వారిని త్వరగా గుర్తించి వారికి సరైన చికిత్సను అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కరో నా ప్రభావం ప్రారంభం అయినప్పుడు పదుల సంఖ్యలో ఉన్న కేసులు లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత అమాంతం పెరుగుతూ వచ్చి గత నెల వరకు 100 నుంచి 150 వరకు కేసులు నమోదు కాగా ప్రస్తుతం ప్రతిరోజూ 250 నుంచి 350మధ్యలో కేసులు నమోదవుతున్నాయంటే వైరస్‌ ఉధృతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీర్ఘకాలిక వ్యాధు లు ఉన్నవారు, 60 సంవత్సరాల పైబడిన వారే ఎక్కువగా మృత్యువాత పడడం కొందరు సొంత వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో మరణాలు సంభవిస్తున్నాయనే వాదనలు విని పిస్తున్నాయి.


రోజుకు 250 నుంచి 350 మధ్యలో కేసుల నమోదు

రోజు రోజుకూ పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య పెరిగిపో తుండడం వారికి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారు పరీక్షల నిమిత్తం వస్తే గంటల తరబడి నిలబడడం లేదంటే వారికి కేటాయించిన సంఖ్య వచ్చే సరికి రెండు రోజుల వరకు సమయం పట్టడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రోజుకు 1500ల వరకు పరీక్షలు చేయాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రులలో పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో ర్యాపిడ్‌ పరీక్షలను నిర్వహిస్తు న్నారు. అయితే గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. రోజుకు 250 నుంచి 350 మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు ఆయా మండలాల్లో, గ్రామాలల్లో అత్యధిక కేసులు నమోదవుతుండడంతో గ్రామీణ ప్రజలు ఆందోళన చెందు తున్నారు. పైగా పలు గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకు నేందుకు ఆయా మండల కేంద్రాల్లోని ఆసుపత్రులకు రావా లంటే నానా అవస్థలు పడాల్సి వస్తోందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ర్యాపిడ్‌ పరీక్షలకు తోడు కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రుల నుంచి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల ద్వారా సేకరించిన శాంపిల్స్‌ను హైదరాబాద్‌ కు పంపగా నిత్యం 50 నుంచి 100 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవు తోంది.


ఉద్యోగులు, రాజకీయ వర్గాల్లో గుబులు

గతంలో పట్టణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా కరో నా బారినపడుతుండడం కనిపించేది. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మండలస్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కరోనా వైరస్‌ బారిన పడడంతో ఎవరైన కార్యాలయానికి పలు పనుల నిమిత్తం వచ్చినా భయం భయం గానే గడపాల్సిన పరిస్థితులు ఏర్పడు తున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆయా మండలా ల్లో వైరస్‌ బారిన పడి హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతుండడంతో పలు కార్యాలయాలు ఖాళీగా కనిపిస్తు ండడంతో నిత్యం ఆయా కార్యాలయాలకు వస్తున్న ప్రజల కు రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, లేదంటే సద రు ఉద్యోగి బాధ్యతలు మరో ఉద్యోగిపై అదనపు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమా లకు హాజరవుతున్న పలువురు రాజకీయ నాయకులు వైరస్‌ బారిన పడుతున్నారు. ముందు రోజు కార్యక్రమానికి హాజరై జలుబు, దగ్గు, జ్వరంతో ఎవరైన ఇబ్బందులు పడితే వారితో పాటు వీరు కూడా ఆసుపత్రు లకు పరుగులు తీస్తూ పరీక్షలు చేయించుకుంటున్నారని సమా చారం. అయితే కరోనా బారిన పడిన వారిని నిత్యం పర్యవేక్షి స్తూ వారికి ఆరోగ్యం మెరుగుప రుచుకునేందుకు అన్ని రకాల సలహాలు సూచనలతో పాటు వైద్యసేవలు అందిస్తున్న సిబ్బం ది సైతం కరోనా బారిన పడడ ంతో మిగిలిన ఉద్యోగులపై అదనపు భారం పడుతుందని సమాచారం.


చిన్నపాటి జ్వరం వచ్చినా వణుకుతున్న జనం

సాధారణంగా సీజనల్‌ వ్యాధులు ఆగస్టు, సెప్టెంబరు నెలలో రావడం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పాటి జ్వరం వచ్చినా ప్రజలు వణికే పరిస్థితి ఏర్పడుతోంది. ఆరు నెలలుగా జిల్లాను కరోనా పట్టి పీడిస్తున్నప్పటికీ గత రెండు నెలలుగా వాతావరణం ఆందోళనకరంగా మారింది. ఏది సాధారణ జ్వరమో ఏది కరోనా కారక జ్వరమో అర్థం కాక భయంతో వణికిపోతున్నారు ప్రజలు. అయితే వైద్యుల అంచనా ప్రకారం జ్వరం వచ్చిన వారిలో 50శాతం కరోనా బాధితులు ఉంటున్నారు. 10 శాతం మందిలో కరోనాతో పాటు టైఫాయిడ్‌, మలేరియా వంటివి కూడా ఉంటున్నా యని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ వైద్యులు సైతం జ్వరానికి సాధారణ జ్వరానికి స్పష్టమైన తేడాలు గుర్తించ లేకపోతున్నారు. చిన్నపాటి జ్వరం రాగానే తాము వైరస్‌ బారిన పడ్డామేమోనని ఆందోళన చెందుతూ సరైన నిద్రపో కపోవడం, ఆందోళనతో సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు వివరి స్తున్నారు.


పెరుగుతున్న మరణాల సంఖ్య

కరోనా వైరస్‌ ప్రభావం వల్ల మరణాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య అధికారికంగా 10గా పేర్కొంటు న్నా జిల్లాలోని ఆయా మండలాల్లో కలిపి మొత్తం 40 మందికి పైగానే మరణించారని సమాచారం. చాలా మట్టు కు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు కరోనా వైరస్‌ బారిన పడిన కొద్దిరోజులకే మృత్యువాత పడుతుండడంతో వైద్యులు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తు లు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అయితే కరోనా కేసులతో పాటు రికవరీ రేటు కూడా మెరు గ్గానే ఉందని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇప్ప టి వరకు జిల్లాలో 6 వేలకు పైగా కేసులు నమోదు కాగా దాదాపు 2500లకు పైగానే కరోనా బారిన పడి రికవరీ అవుతున్నట్లు సమాచారం.

Updated Date - 2020-09-07T10:58:05+05:30 IST