‘ప్రతి ఒక్కరికీ కరోనాపై అవగాహన ఉండాలి’

ABN , First Publish Date - 2021-04-24T05:07:03+05:30 IST

గ్రామాల్లో ప్రతీ ఒక్కరికీ కరోనా మహమ్మారిపై అవగాహన ఉండాలని సర్పంచ్‌ కోట నాగేశ్వరరావు అన్నా రు.

‘ప్రతి ఒక్కరికీ కరోనాపై అవగాహన ఉండాలి’
గణపవరంలో కరోనా వైరస్‌పై అవగాహన ర్యాలీ

గణపవరం, ఏప్రిల్‌ 23 : గ్రామాల్లో ప్రతీ ఒక్కరికీ కరోనా మహమ్మారిపై అవగాహన ఉండాలని సర్పంచ్‌ కోట నాగేశ్వరరావు అన్నా రు. కరోనా వైరస్‌ రెండో దశపై కాశిపాడులో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలన్నారు. ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, వీఆర్వోల సంఘం మండల అధ్యక్షుడు నిడమర్తి కేశవమూర్తి, గ్రామ కార్య దర్శి బుజ్జమ్మ, తదితరులు పాల్గ్గొన్నారు.

తణుకులో రేపు సంపూర్ణ లాక్‌డౌన్‌

తణుకు, ఏప్రిల్‌ 23 : కరోనా కేసుల పెరుగుతున్న తరుణంలో 25న ఆదివారం సంపూర్ఱ లాక్‌డౌన్‌ ప్రకటించామని చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ అధ్యక్షుడు మాజేటి ప్రకాశరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మందుల షాపులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. పాల షాపులు ఉదయం 5 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు అనుమతి ఉందన్నారు. 

Updated Date - 2021-04-24T05:07:03+05:30 IST