ఖాద్రీశుడికి కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2021-06-23T06:15:17+05:30 IST

కరోనా, కర్ఫ్యూ ప్రభావంతో ఖాద్రీశుడీ ఆలయంలో కాసులకు కరువు ఏర్పడింది. నిత్యం భక్తులతో కళకళలాడే ఖాద్రీశుడీ ఆలయం భక్తులు లేక వెలవెలబోతోంది

ఖాద్రీశుడికి కరోనా దెబ్బ

- కర్ఫ్యూతో తగ్గిన భక్తుల రాక

- పడిపోయిన ఆలయ ఆదాయం

- సేవలు నిల్‌... ఆదాయం డల్‌..

- సిబ్బంది జీతాలకూ ఇబ్బందులే..

కదిరి, జూన 22: కరోనా, కర్ఫ్యూ ప్రభావంతో ఖాద్రీశుడీ ఆలయంలో కాసులకు కరువు ఏర్పడింది. నిత్యం భక్తులతో కళకళలాడే ఖాద్రీశుడీ ఆలయం భక్తులు లేక వెలవెలబోతోంది. రోజూ లక్ష రూపాయలకు పైగా ఆదాయం ఉండే ఆలయంలో భక్తుల రాక తగ్గడంతో వేల ల్లోకి చేరిం ది. కొన్ని రోజుల్లో వందల్లోనే ఉండటం గమనార్హం. ఆలయంలో నిర్వహించే దాదాపు అన్ని సేవలు బంద్‌ అయ్యాయి. స్వామివారికి నిర్వహించే కొన్ని అర్జిత సేవల ద్వారానే ఆలయానికి రోజువారి ఆదాయం వస్తోం ది. దీంతో ఆలయంలో నిర్వహించే కొన్ని సేవలు, సిబ్బంది జీతాలకు ఇబ్బం దులు ఏర్పడ్డాయి. కర్ణాటక రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన ఉండటంతో అక్కడి భక్తుల రాక పూర్తిగా నిలిచిపోయింది. ఆ ప్రభావం ఆలయం మీదేనే కాకుం డా ఆలయంపై అధారపడి ఉన్న అనుబంధ రంగాలపై కూడా పడింది. ఆల యంపైనే అధారపడి వ్యాపారాలు చేసుకునే వారు ఉపాధి లేక అ వస్థలు పడుతున్నారు. భక్తులు లేక ఆలయ ప్రధాన వీధి బోసిపోయింది. 

అదాయ వనరులన్నీ బంద్‌ 

స్వామి వారి ఆలయానికి నిత్యం ఆదాయాన్ని అందించే వనరులన్నీ బం ద్‌ అయ్యాయి. ముఖ్యంగా స్వామి ప్రసా దంగా భక్తులకు అందించే లడ్డు, రోజువారి స్వామి వారికి చేసే అర్చనలు, అభిషేకాలు, కల్యాణోత్సవాలు బం ద్‌ అయ్యాయి.  భక్తులు ఆలయంలో బస చేసేందుకు ఇచ్చే గదుల్లో కరోనా భయంతో ఎవరు ఉండటం లేదు. దీంతో ఆలయంలో రోజువారిగా వచ్చే అదాయం పూర్తిగా నిలిచి పోయింది. మామూలు రోజుల్లో రోజుకు లక్ష రూపాయల కు పైబడి ఆదాయం వచ్చేది. సంవత్సరానికి సుమారు రూ.9 కోట్లకు పైబడి ఆదాయం ఉంది. అయితే కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఆదాయం పూర్తిగా పడి పోయింది. శని, అదివారాల్లో వచ్చే భక్తులు తప్ప మిగతా రోజుల్లో భక్తుల రాక పూర్తిగా స్తంభించి పోయింది. వివిధ సేవలకు టిక్కెట్ట అమ్మకాల ద్వారా రూ. 2వేలకు మించ డం లేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కరోనా రెండోదశ ప్రారంభమయ్యింది. దీంతో ఆలయ అదాయం పూర్తిగా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో రూ.20,85,020 ఆదాయం వచ్చింది. ఆనెల 5వతేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగాయి. దీంతో కొంత ఆదాయం పెరి గింది. మే నెలలో రూ. 4,96,068 మాత్రమే వచ్చింది. జూన నెల 15వ తేదీ వరకు రూ. 5,96,760 ఆదాయం మాత్రమే వచ్చింది.

సిబ్బంది వేతనాలకు ఇబ్బందులే.. 

ఆలయ ఆదాయం తగ్గడంతో అక్కడ పనిచేసే ఆధికా రులు, సిబ్బంది జీ తాలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఉద్యోగుల జీతాల్లో ఎటువంటి కోత విధిం చనప్పటికి వేతనాలకు సరిపడినంతా ఆదాయం కూడా రాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయంలో ముఖ్యంగా స్వామి వారి ధూప, దీప నైవే ద్యాలకు మొదటగా వెచ్చిస్తారు. ఆతరువాత ఉద్యోగుల వేతనాలకు ఖర్చు  చేస్తారు. ఆలయంలో రెగ్యులర్‌ ఉద్యోగు లు 27 మంది పనిచేస్తుండగా, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సిం గ్‌ కింద 16 మంది పనిచేస్తున్నారు. మొత్తంగా 43 మంది పని చేస్తున్నారు.  వీరందరికి వేతనాలకు ఇవ్వడానికి సుమారు రూ.18 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అయితే గత రెండు నెలలుగా ఆలయ ఆదాయం బాగా తగ్గడం తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అర్ధాకలితో అర్చకులు 

 ఆలయంలో రెగ్యులర్‌ ప్రాతిపాదికన నలుగురు అర్చకులు ఉన్నారు. వారికి మాత్రమే దేవదాయశాఖ వారు జీతాలు చెల్లిస్తారు. అక్కడ పనిచేసే ఇతర అర్చకులు ఆలయంలో వివిధ రకాల పూజలు చేసి జీవనం సాగి స్తున్నారు. వారందరికి ప్రస్తుతం ఉపాధి కరువైయింది. శుభకార్యాలు తక్కు వగా ఉండడంతో అర్చకులకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. నాయీబ్రాహ్మణులు కూ డా ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలో జరిగే కేశ ఖండన, ఇతర శుభకార్యాలకు గతంలో ఎక్కువ గిరాకీ ఉండేది. ప్రస్తు తం కర్ఫ్యూతో ఉపాధి కరువైనట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వ్యాపారాలు వెలవెల 

ఆలయ ఆవరణలో దేవస్థానం నిర్వహించే దుకాణాల్లో కూడా వ్యాపా రాలు లేక వెలవెలబోతున్నాయి. వేలం పాటలో లక్షలాది రూపాయలు వెచ్చించి దక్కించుకున్న దుకాణాలు కర్ఫ్యూ కారణంగా వ్యాపారాలు లేక బోసిపోతున్నాయి. ఆలయం ఎదుట ఉన్న చెప్పుల స్టాల్‌లో రోజుకు వం ద మంది కూడా రాక ఇబ్బందులు పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాదాపు రూ. 6లక్షల వరకు వేలం పాట పాడినట్లు తెలిపారు. అక్కడ టెంకాయలు అమ్మే వారు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు.  వారే కాక ఆల యంపై అధారపడి పరోక్షంగా తిరువీధుల్లో వందలాది కు టుంబాలు ఉన్నా యి. వారందరికి ఉపాధి కరువైయింది. బొమ్మలు, గాజులు, కుంకుమ అమ్మే దుకాణాలు, హోటళ్లు, లాడ్జ్‌లు, ఇతర వ్యాపార వర్గాల వారు కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు.

ఆలయ ఆదాయంపై కర్ణాటక లాక్‌డౌన ప్రభావం 

ఖాద్రీశుడీ దర్శనానికి జిల్లా నుంచే కాక కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. శుక్ర, శని, అదివారాల్లో కర్ణాటక భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కర్ణాటకలో ప్రస్తుతం లాక్‌డౌన అమలులో ఉండటం తో అక్కడి నుంచి భక్తుల రాక పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆలయ ఆదాయానికి భారీగా దెబ్బపడింది. 21 నుంచి మన రాష్ట్రంలో ఉదయం 6గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండటం వల్ల భక్తులు రాక పెరుగుతుందని ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి ఆశాభా వం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో లాక్‌డౌన ఎత్తివేస్తే భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉంటాయన్నారు. 

Updated Date - 2021-06-23T06:15:17+05:30 IST