అద్దె వాహనాలకు కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2021-06-18T06:43:11+05:30 IST

కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా ఆర్థిక కష్టాల్లోకి నెట్టివేసింది. వైరస్‌ కట్టడి కోసం రాష్ట్రంలో క ర్ఫ్యూ అమలవుతోంది.

అద్దె వాహనాలకు కరోనా దెబ్బ
పార్కింగ్‌ మైదానాలకే పరిమితమైన బాడుగ వాహనాలు

కర్ఫ్యూతో ఊరుదాటని జనం 

బాడుగలు లేక వాహన యజమానుల లబోదిబో..

బ్యాంకు కంతులు చెల్లించలేక అవస్థలు


రాయదుర్గంటౌన, జూన 17 : కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా ఆర్థిక కష్టాల్లోకి నెట్టివేసింది. వైరస్‌ కట్టడి కోసం రాష్ట్రంలో క ర్ఫ్యూ అమలవుతోంది. దీంతో సరిహద్దు దాటాలంటే ఈ-పాస్‌ తప్పనిసరి. కరోనా భయంతో జనం ఇల్లు దాటాలంటేనే భయపడిపోతున్నారు. పెళ్లిళ్లు కూడా వాయిదాలు వేసుకున్నారు. ఫలితంగా అద్దె వాహనాలకు బాడుగ లు దొరకడం లేదు. ట్యాక్సీలు కనీసం స్టాండ్‌కు కూడా రావడం లేదు. గత నెలంతా ఐదారురోజులు కూడా బాడుగలు దొరకలేదని వాహన యజమానులు వాపోతున్నారు.  బ్యాంకులకు కంతులు కట్టలేక వాహనదారులు,  కుటుంబ పోషణ భారమై డ్రైవర్లు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. బ తుకుబండి సాగేదెలా అంటూ ట్యాక్సీ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.


వందకుపైగా అద్దె ట్యాక్సీలు

 రాయదుర్గం పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు అద్దెవాహనాలు నడుపుతున్నారు. పట్టణంలో దాదాపు వందకు పైగా అద్దె ట్యాక్సీలు వున్నాయి.  లక్ష్మీబజారులో అద్దె ట్యాక్సీ స్టాండు వుంది. అయితే కర్ఫ్యూ అమలుతో  వా హనాలు వాహనదారుల ఇంటికే పరిమితమయ్యాయి. దాదాపు 200 కు టుంబాలు ట్యాక్సీలపై ఆధారపడి జీవిస్తున్నాయి. రాయదుర్గం పట్టణం నుంచి అనంతపురం, బళ్లారి, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ వంటి ప్రాంతాలకు ఎక్కువగా వాహనాలు అద్దెకు తీసుకెళతారు. పెళ్లిళ్ల సీజన, వేసవికాలంలో వివాహాలు, తీర్థ యాత్రలకు డిమాండ్‌ వుంటుంది. నెలలో ఎంత తక్కువ కాదన్నా 25 రోజులకు పైగా బాడుగలు వుంటాయి. గత యే డాది కాకుండా ఈ యేడాది కూడా సీజనలో కరోనా మహమ్మారి ట్యాక్సీ యజమానులు, వాటిపై ఆధారపడిన డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాక్సీ డ్రైవర్లు రోజూ తెల్లవారగానే ట్యాక్సీ స్టాండ్‌కు చేరుకోవడం... ఈ రోజైనా బాడుగ దొరకదా, ఇంటి ఖర్చులకు డబ్బు రాదా అనే ఆశతో మధ్యాహ్నం వరకు నిరీక్షించి నిరాశతో ఇంటికి చేరుకుంటున్నారు. బాడుగ దొరికితే డ్రైవర్లకు రూ.500 బత్తా వస్తుంది. నెలలో కనీసం 20 రో జులు బాడుగ దొరికితే రూ.పది వేలు వస్తుంది. ఆ డబ్బుతో ఇంటి అద్దె, కు టుంబ పోషణ, పిల్లల చదువులు, ఫీజులు ఇలా ప్రణాళికల ప్రకారం జీవ నం సాగిస్తున్నారు.


ఈ-పాస్‌ వుంటేనే అనుమతి

కరోనా ప్రభావంతో ఎక్కడ ట్యాక్సీలు అక్కడే ఆగిపోయాయి. తెలంగాణ, కర్ణాటక రాషా్ట్రల్లో లాక్‌డౌన కారణంగా ఈ-పాస్‌ వుంటేనే ఆయా రాషా్ట్రల్లోకి వాహనాలను అనుమతిస్తున్నారు. అందరికీ ఈ-పాస్‌ దొరకడం లేదు. ఆ ప్రభావం అద్దె ట్యాక్సీలపై పడుతోంది. మే నెల అంతా ఐదారు రోజులు కూ డా బాడుగలు దొరక లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఇంటి అద్దె, కుటుంబ పోషణ భారమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు కూడా పుట్టక ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్సీ యజమానుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అత్యధిక శాతం అద్దె ట్యాక్సీలు ప్రైవేటు ఫైనాన్స సంస్థల్లో అప్పులు చేసి కొన్నవే. బాడుగలు దొరకక పూట గడవటమే కష్టమైతే నెలనెలా ఫైనాన్స సంస్థలకు అప్పులు ఎలా కట్టేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా  ప్రైవేటు ఫైనాన్స సంస్థలు.. కంతులు కడతారా? వాహనాలు సీజ్‌ చేయాలా? అంటూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వడ్డీ లేకుండా మూడు నెలల గడువు ఇప్పించాలని వాహనదారులు కోరుతున్నారు.


ఎలా బతకాలి?

గాజుల కిరణ్‌కుమార్‌, వాహన యజమాని

కరోనా కారణంగా సామాన్యుడు బతకడం కష్టంగా మారింది. పెళ్ళిళ్ల సీజన, వేసవికాలంలో మాకు దాదాపు 25 రోజులు బాడుగలు వుండేవి. కర్ణాటక, హైదరాబాద్‌, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లే వాళ్లం. లాక్‌డౌన వల్ల ఈ-పాస్‌ వుంటేనే అనుమతిస్తున్నారు. నెలంతా ఐదారు రోజులు కూడా బాడుగలు దొరకడం లేదు. నెలకు రూ.1.05 లక్షలు ఫైనాన్స సంస్థలకు కంతులు చెల్లించాల్సి వుంది. ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కరోనాతో ఉపాధి కోల్పోయాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. 


ఒత్తిడి తట్టుకోలేక అప్పు చెల్లించా

దాదాఖలందర్‌, వాహనయజమాని

ఫైనాన్స సంస్థ ఒత్తిడి తట్టుకోలేక అప్పు చేసి వా హనానికి సంబంధించిన 15 రోజుల క్రితం అప్పు మొత్తం చెల్లించా. చెక్‌బౌన్స అయితే వడ్డీతో కలిపి చెల్లించాల్సి వుంటుంది. ముఖ్యంగా చెక్‌ బౌన్స అ యితే సీ బిల్‌ స్కోరు తగ్గిపోతుంది. దీంతో భవిష్యత్తులో ఎప్పుడైనా అప్పు కావాలంటే దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అద్దెవాహనాల యజమానుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. 


Updated Date - 2021-06-18T06:43:11+05:30 IST