కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-04-12T08:15:50+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు రెండో రోజు కూడా 700 దాటాయి. అత్యధికంగా 719 మందికి వైరస్‌ సోకింది.

కరోనా విజృంభణ

తాజాగా 719 మందికి  వైరస్‌.. నలుగురి మృతి

తిరుపతి నగరంలోనే 296.. రూరల్‌లో 100


తిరుపతి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు రెండో రోజు కూడా 700 దాటాయి. గడచిన 24 గంటల్లో మళ్లీ రాష్ట్రంలోనే అత్యధికంగా 719 మందికి కరోనా సోకింది. అదే సమయంలో వైరస్‌ బారిన పడి రాష్ట్రంలోనే అత్యధికంగా నలుగురు మరణించారు. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 94,160కు, కొవిడ్‌ మరణాల సంఖ్య 887కి చేరాయి. యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3917కు పెరిగాయి. కొత్తగా గుర్తించిన కేసులు తిరుపతి నగరంలో 296, తిరుపతి రూరల్‌లో 100, శ్రీకాళహస్తిలో 34, ఎర్రావారిపాలెంలో 18, పలమనేరు, రేణిగుంట మండలాల్లో 17 వంతున, మదనపల్లెలో 14, చిత్తూరులో 13, పుత్తూరులో 12, కుప్పం, పీలేరు మండలాల్లో 11 వంతున, వడమాలపేటలో 10, పుంగనూరులో 9, జీడీనెల్లూరు, రామచంద్రాపురం మండలాల్లో 8 వంతున, ఏర్పేడులో 7, కలికిరి, పులిచెర్ల మండలాల్లో 6 వంతున, బి.కొత్తకోట, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, గుడుపల్లె, కార్వేటినగరం, ములకలచెరువు మండలాల్లో  5 వంతున, బైరెడ్డిపల్లె, గుర్రంకొండ, కలకడ, పీటీఎం, వెదురుకుప్పం మండలాల్లో 4 వంతున, బంగారుపాలెం, చౌడేపల్లె, గుడిపాల, కేవీపల్లె, నగరి, నిండ్ర, పాకాల, పెద్దమండ్యం, పెద్దపంజాణి, పూతలపట్టు, రొంపిచెర్ల, శాంతిపురం, సదుం, శ్రీరంగరాజపురం, తవణంపల్లె, తంబళ్ళపల్లె మండలాల్లో 3 చొప్పున, బీఎన్‌ కండ్రిగ, గంగవరం, ఐరాల, కురబలకోట, నాగలాపురం, పిచ్చాటూరు, సోమల, తొట్టంబేడు, విజయపురం మండలాల్లో 2 వంతున, కేవీబీపురం, నారాయణవనం, రామకుప్పం, రామసముద్రం, సత్వవేడు, వరదయ్యపాలెం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో అధికారులు మళ్లీ కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసి.. కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. 


బొజ్జల సుధీర్‌రెడ్డికి కరోనా

శ్రీకాళహస్తి: టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బొజ్జల సుఽధీర్‌రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం ఆయన స్వయంగా ప్రకటించారు. కొవిడ్‌ సోకినందున తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక పోతున్నానని... కార్యకర్తలు ఈ విషయం గుర్తించి తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అఽభ్యర్థి పనబాక లక్ష్మి విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 


క్వారంటైన్‌లో జడ్పీ సీఈవో 

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా పరిషత్‌ సీఈవో ప్రభాకరరెడ్డికి ఆదివారం కరోనా సోకడంతో క్వారంటైన్‌కు వెళ్లారు. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పర్యటించడం, పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణ పనుల్లో పాల్గొన్న జడ్పీ సీఈవోకు వైరస్‌ సోకింది. వైద్యుల సూచన మేరకు ఆయన క్వారంటైన్‌ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-04-12T08:15:50+05:30 IST