ఖమ్మంలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-05-09T19:58:45+05:30 IST

ఖమ్మం: నగరంలో కరోనా విజృంభిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు.

ఖమ్మంలో కరోనా విజృంభణ

ఖమ్మం: నగరంలో కరోనా విజృంభిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. నగరంలో ఏ ఒక్క ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒక్క బెడ్సే కాదు.. ఆస్పత్రిలో చేరిన రోగులకు సరైన వైద్యం కూడా అందడంలేదని బాధితులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు వదిలేస్తున్నారు.


మరోవైపు కరోనా పరీక్షల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నగరంలో రోజుకు కేవలం వెయ్యి మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాత బస్టాండ్‌లో ప్రత్యేకంగా కోవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పరీక్షల కోసం జనం బారులు తీరుతున్నారు. క్యూ లైన్‌లో నిలబడే ఓపిక లేక చెప్పులను క్యూలో పెట్టి ఎదురుచూస్తున్నారు. కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలని బాధితులు కోరుతున్నారు. టెస్టులు చేయించుకున్నవారిలో 50 శాతం మందికి కరోనా నిర్ధారణ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - 2021-05-09T19:58:45+05:30 IST