‘మిషన్‌ ఇంపాజిబుల్‌’కు కరోనా బ్రేక్‌

Jun 6 2021 @ 00:00AM

టామ్‌ క్రూజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ ఫ్రాంఛైజీ ‘మిషన్‌: ఇంపాజిబుల్‌’లో తెరకెక్కుతున్న తాజా చిత్రీకరణకు కరోనా బ్రేకులు వేసింది. రొటీన్‌ చెకప్‌లో భాగంగా చేసిన పరీక్షల్లో కొందరు యూనిట్‌ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జూన్‌ 14 వరకూ ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 7’ చిత్రీకరణ నిలిపివేసినట్టు పారామౌంట్‌ పిక్చర్స్‌ తెలియజేసింది. గతేడాది సెట్‌లో సామాజిక దూరం, కరోనా నిబంధనలు పాటించడం లేదని హీరో టామ్‌ క్రూజ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో అప్పట్లో వైరల్‌ అయ్యింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.