వెంటాడుతున్న భయం.. ఆగని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-08-06T20:28:17+05:30 IST

కరోనా భయం వెంటాడుతోంది. పల్లెలతో పోలిస్తే సిరిసిల్ల, వే ములవాడ పట్టణాల్లో భయంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో

వెంటాడుతున్న భయం.. ఆగని కరోనా ఉధృతి

ఆందోళనలో ప్రజలు 

నెలకు సరిపడ విటమిన్‌ టాబ్లెట్ల కొనుగోలు 

మందుల దుకాణాల్లో కొరత.. తాజాగా 27 పాజిటివ్‌

ఇప్పటి వరకు 644 కేసులు  


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): కరోనా భయం వెంటాడుతోంది. పల్లెలతో పోలిస్తే సిరిసిల్ల, వే ములవాడ పట్టణాల్లో భయంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.  కరోనా ఎఫెక్ట్‌తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముందస్తుగా నెలకు సరిపడ విటమిన్స్‌, మినరల్‌ మాత్రలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా విటమిట్‌ డీ3, సీ, జింక్‌ టాబ్లెట్లను విరివిగా వాడుతు న్నారు. ఫలితంగా మెడికల్‌ దుకాణాలకు వెళ్తే కొరత వెక్కిరిస్తోం ది. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడలో అత్యధిక కేసులు నమోదవు తున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను కట్టడితోపాటు జిల్లాలో ప్రత్యేకంగా కొవిడ్‌ వార్డులు, ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితులకు భరోసా ఇచ్చినా భయం మాత్రం వీడడం లేదు. కరోనా నివారణకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కషాయం తోపాటు హోమియో, ఆయుర్వేదిక్‌ మందులను వాడుతున్నారు. కొందరు వైరస్‌ సోకకుండా మెడలో పౌడర్‌ ట్యాగ్‌లు వేసుకొని తిరుగుతున్నారు. జలుబు, దగ్గు, సాధారణ జ్వరం, తుమ్ములు వం టి లక్షణాలు ఉన్న వారు టెస్టుల కోసం క్యూ కడుతున్నారు. మరో వైపు సీజనల్‌ వ్యాధులు మొదలు కావడంతో ఏది కరోనానో..? సాధారణ జ్వరమో? వైరల్‌ జ్వరమో? తెలియక ప్రజలు అయోమయానికి గుర వుతున్నారు. 


సిరిసిల్ల జిల్లాలో 644  కొవిడ్‌ కేసులు

రాజన్న సిరిసిల్ల్లలో బుధవారం 27 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.  644 కేసులు నమోదయ్యాయి. 479యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  156 మంది డిశ్చార్జి అయ్యారు. తొమ్మిది మంది మృతి చెందారు.


100 మందికి పాజిటివ్‌..?

జిల్లాలో కరోనా అనుమానితులు శాంపిళ్లు ఇస్తున్నా ఫలితాలు వెంటవెంట రాక పోవడంతో మానసికంగా ఆందోళన చెందుతు న్నారు. ముందుగా శాంపిళ్లు ఇచ్చిన వారికే పాజిటివ్‌, నెగెటివ్‌ మెసేజ్‌లు వెళ్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ వద్ద బుధవారం ర్యాపిడ్‌ టె స్ట్‌లతోపాటు శాంపిళ్లకు సంబంధించి 27 పాజి టివ్‌ల వివరాలు మాత్రమే ఉన్నాయి. వంద మంది పాజిటివ్‌ వచ్చినట్లు మేసేజ్‌లు అం దినట్లు  సమాచారం. ఈ విషయమై  వై ద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరా తీస్తున్నారు.

Updated Date - 2020-08-06T20:28:17+05:30 IST