మచిలీపట్నం డివిజన్‌లో 32 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-08-08T16:20:41+05:30 IST

మచిలీపట్నం డివిజన్‌లో 32 కరోనా కేసులు శుక్రవారం నమోదైనట్లు ఆర్డీవో ఖాజావలి తెలిపారు. మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ, నవీన్‌మిట్టల్‌ కాలనీ, శారదానగర్‌, ఇనగుదురుపేట, బుట్టాయిపేట,

మచిలీపట్నం డివిజన్‌లో 32 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం డివిజన్‌లో 32 కరోనా కేసులు శుక్రవారం నమోదైనట్లు ఆర్డీవో ఖాజావలి తెలిపారు. మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ, నవీన్‌మిట్టల్‌ కాలనీ, శారదానగర్‌, ఇనగుదురుపేట, బుట్టాయిపేట, భాస్కరపురం, నరసింహనగర్‌, రామానాయుడుపేట,  సర్కిల్‌పేట,  హౌసింగ్‌బోర్డు కాలనీల్లో ఒక్కోకేసు చొప్పున నమోదైనట్లు ఆయన తెలిపారు.  గొడుగుపేట, చిలకలపూడి, మాచవరం, రాజుపేటలలో రెండు కేసుల చొప్పున నమోదయ్యాయన్నారు. బందరు మండలం పెదకరగ్రహారం నాగాయలంక, మొవ్వ మండలం నిడుమోలు,  చల్లపల్లిలో  ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయన్నారు. గూడూరు మండలం గండ్రం, నారికేడలపాలెం, కుమ్మరిపాలెం, కంచా కోడూరులలో ఒక్కో కేసు, కంకటావలో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. 


గుడివాడ డివిజన్‌లో 11 కేసులు నమోదు

గుడివాడ అర్బన్‌ మినహా డివిజన్‌లో వివిధ మండలాల్లో శుక్రవారం 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యా యని ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌ తెలిపారు. తాజా కేసులతో కలిపి డివిజన్‌లో 373 కేసులు నమోదైనట్లు ఆర్డీవో చెప్పారు. 


పామర్రు : పట్టణంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పీహెచ్‌సీ వైద్యురాలు పి.సుధారాణి తెలిపారు. 


కైకలూరు :  ఆటపాకలో ఒకటి, రామవరంలో ఒకటి  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ ఎం.సూర్యారావు తెలిపారు. కలిదిండి : కోరుకొల్లులో శుక్రవారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పీహెచ్‌సీ వైద్యాధికారి బాలకుమార్‌ తెలిపారు. ఈవోఆర్డీ నరసింహారావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 


జగ్గయ్యపేటలో మరో 11  

జగ్గయ్యపేటలో శుక్రవారం మరో 11 మందిలో పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. జగ్గయ్యపేటకు చెందిన 10 మందికి, బలుసుపాడుకు చెందిన ఒకరికి కరోనా లక్షణాలు పరీక్షల్లో తేలింది. పట్టణంలో ఇప్పటివరకు 101 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని, 12 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కమిషనర్‌ రామ్మోహన్‌ తెలిపారు.  


నందిగామ రూరల్‌ పట్టణంలోని రైతుపేటకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా వచ్చిందని వైద్యాధికారులు శుక్రవారం పేర్కొన్నారు. దగ్గు, జలుబుతో బాధపడుతుంటే పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు.


నూజివీడు నియోజకవర్గంలో 50 కేసులు

నూజివీడు నియోజకవర్గం పరిధిలో శుక్రవారం 50 కరోనా కేసులు నమోదయ్యాయి. నూజివీడు పట్టణంలో 45 కేసులు రాగా, ఒక్క కొత్తపేటలోనే 23 కేసులు వచ్చాయి. ఆగిరిపల్లి మండలంలో ఐదు కేసులు నమోదయ్యాయి.


కరోనాతో వృద్ధురాలి మృతి

గంపలగూడెం:  ఉటుకూరులో కరోనాతో ఓ వృద్ధురాలు శుక్రవారం మృతి చెందింది. విజయవాడలో వృద్ధురాలికి కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా తేలడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే ఆమె మృతి చెందింది. తగు జాగ్రత్తలతో వృద్ధురాలి అంత్యక్రియలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు తహసీల్దార్‌ ఆసియా తెలిపారు. పెనుగొలనులో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-08-08T16:20:41+05:30 IST