ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 98 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-08-07T16:59:50+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్యఆరోగ్య శాఖ ప్రకటించిన బులెటిన్‌ ఆధారంగా నల్లగొండ జిల్లాలో 52, సూర్యాపేట జిల్లాలో 34, యాదాద్రిభువనగిరి జిల్లాలో 12కేసులు ఉన్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 98 పాజిటివ్‌ కేసులు నమోదు

నల్లగొండ (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్యఆరోగ్య శాఖ ప్రకటించిన బులెటిన్‌ ఆధారంగా నల్లగొండ జిల్లాలో 52, సూర్యాపేట జిల్లాలో 34, యాదాద్రిభువనగిరి జిల్లాలో 12కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 2170 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 1946మంది ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన వృద్ధుడు(74) కరోనా పాజిటివ్‌తో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నకిరేకల్‌ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన మహిళ(45) కరోనా వ్యాధితో గురువారం మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 


పాజిటివ్‌ కేసులు ఎక్కడెక్కడంటే

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలో ఇద్దరికి, అనంతగిరి మండలం గోండ్రియాల, మేళ్లచెర్వు మండలం వేపలమాదారంలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ముగ్గురికి, శారాజీపేటలో ఒకరికి, పోచంపల్లి మండలం వంకమామిడిలో ఒకరికి, రాజాపేట పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌, యాదగిరిగుట్ట మండలంలో ఓకానిస్టేబుల్‌, ఓమహిళకు, రామన్నపేట మండలం బాచుప్పల్‌లో ఓ మహిళకు, బొమ్మలరామారం మండలంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. 


నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఏరియా ఆస్పత్రిలో 24మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా హిల్‌కాలనీకి చెందిన వ్యక్తికి, ఇద్దరు హాలియా వాసులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మునుగోడు మండలంలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


ర్యాపిడ్‌ పరీక్షల్లో వలిగొండలో 7, దేవరకొండలో 5, చౌటుప్పల్‌లో 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వలిగొండ, దేవరకొండ, చౌటుప్పల్‌లో మొత్తం 133మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్‌ వచ్చింది.


కొండమల్లేపల్లిలో స్వచ్ఛంద బంద్‌

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఈ నెల 6నుంచి 14వరకు అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ చేస్తున్నట్లు నిర్వాహ కులు తెలిపారు. మండల కేంద్రంలో ఎవరైనా నిబంధనలు అతి క్రమిస్తే  జరిమానా విధిస్తామని సర్పంచ్‌ కుంభం శ్రీనివా్‌సగౌడ్‌ హెచ్చరించారు. కరోనా నిబంధనలకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించి మా స్కులు, శానిటైజర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-08-07T16:59:50+05:30 IST