కట్టడిలేని కరోనా.. నరసాపురంలో మళ్లీ విజృంభణ

ABN , First Publish Date - 2020-08-08T19:04:02+05:30 IST

అక్కడా ఇక్కడా అని లేదు.. జిల్లాలో అన్ని ప్రాంతాలను కరోనా కమ్మేస్తోంది.. అటు పల్లెలను.. ఇటు పట్టణాలను వణికిం చేస్తోంది.. నిన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న నరసాపురం పట్టణంలో మళ్లీ కరోనా విజృంభించింది.. ఏకంగా శుక్రవారం ఒక్కరోజే

కట్టడిలేని కరోనా.. నరసాపురంలో మళ్లీ విజృంభణ

రోజురోజుకు పెరుగుతున్న కేసులు  


నరసాపురం/మొగల్తూరు : అక్కడా ఇక్కడా అని లేదు.. జిల్లాలో అన్ని ప్రాంతాలను కరోనా కమ్మేస్తోంది.. అటు పల్లెలను.. ఇటు పట్టణాలను   వణికిం చేస్తోంది.. నిన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న నరసాపురం పట్టణంలో మళ్లీ కరోనా విజృంభించింది.. ఏకంగా శుక్రవారం ఒక్కరోజే 40 కేసులు నమోదయ్యాయి.ఇక భీమవరందీ ఇదే పరిస్థితి.. ఎక్కడా ఉధృతి తగ్గడంలేదు.. 50 కేసులు నమోదయ్యాయి.. చిన వెంకన్న ఆలయంలోనూ నలుగురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఇలా ఎక్కడ చూసినా 10పైనే కేసులు నమోద య్యాయి. మరో వైపు మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.. 


నరసాపురం నియోజకవర్గంలో 65 కేసులు నమోదయ్యాయి. ఒక్క నరసాపురం పట్టణంలో 40, మండలంలో 21 మందికి కరోనా సోకిందన్నారు.సీతారామపురం సౌత్‌లో 11, వైఎస్‌పాలెంలో 2, కొప్ప ర్రులో 2, మల్లవరంలంక 3, సరిపల్లి, సీతారామపురం నార్త్‌, తూర్పుతాళ్ళులో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. సౌత్‌ గ్రామంలో వచ్చిన 11 మంది ఓఎన్‌జీసీ సిబ్బంది. వీరంతా వివిద రాష్ట్రాలకు చెందినవారు. మొగ ల్తూరు కాళీపట్నం పడమర 2, పాతపాడులో 2 కేసులు నమోదయ్యాయి.  


భీమవరం నియోజకవర్గంలో 53 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.భాధితులను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలి ంచారు.వీరవాసరం కొణితివాడ పీహెచ్‌సీ పరిధిలో తమ్మినీడివారిపాలెం, కొణితివాడ, పాలకోడేరు పరిధిలోని వేండ్రలో ఒక కేసు నమోదయ్యాయి. 


పాలకొల్లు టౌన్‌/ పాలకొల్లు రూరల్‌/ యలమంచిలి : పాలకొల్లు నియోజకవర్గంలో 37 కేసులు నమోదయ్యాయి. పాలకొల్లు పట్టణంలో   12,  మండలంలో 11 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. యలమంచిలి మండలంలో 14 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు డాక్టర్లు తెలిపారు. వీరిని పాలకొల్లు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించామని తెలిపారు. 


ఉంగుటూరు/ గణపవరం/ నిడమర్రు : ఉంగుటూరు నియోజకవర్గంలో 35 కేసులు నమోదయ్యాయి. ఉంగుటూరు మండలం నారాయణపురం 8, గొల్లగూడెం 6,  చేబ్రోలు 3,ఉంగుటూరు 2,గోపీనాథపట్నంలో 1 నమోద య్యాయి.గణపవరం లో 14, సరిపల్లె వెలమపేటలో మహిళకు కరోనా సోకింది..   నిడమర్రు మండల గ్రామాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. 


ఆచంట/ పోడూరు : పోడూరు మండలంలో శుక్రవారం 26 కేసులు నమోదైనట్టు పోడూరు పీహెచ్‌సీ వైద్యురాలు ఎస్‌.కీర్తికిరణ్‌ తెలిపారు. కవిటంలో 13, పెనుమదంలో 5, పోడూరులో 3, మట్టపర్రులో 2, వేడంగిలో 2, గుమ్మలూరులో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు.ఆచంట మండలంలో  8   కేసులు నమోదయ్యాయి.ఆచంటలో-7, వేమవరంలో-1 నమోదైనట్టు తెలిపారు.  


తణుకు/ రూరల్‌/ఇరగవరం/ అత్తిలి : తణుకు నియోజకవర్గంలో 32 కేసులు నమోదయ్యాయి. తణుకు పట్టణంలో 10, తణుకు మండలం తేతలిలో 3, దువ్వలో 2, మహాలక్ష్మి చెరువులో ఒకటి చొప్పున నమోద య్యాయి. ఇరగవరంలో 3,  రేలంగి, ఏలేటిపాడులో ఒక్కో కేసు నమోదైనట్టు తెలిపారు. అత్తిలి మండలం గుమ్మంపాడు 3, ఎల్‌ఎన్‌పురం 2, పాలి 4, బల్లిపాడు, మంచిలిలో ఒక్కో కేసు నమోదయ్యాయి. 


నిడదవోలు/ఉండ్రాజవరం/ పెరవలి రూరల్‌ : నిడదవోలు నియోజక వర్గంలో  29 కేసులు నమోదయ్యాయి. నిడదవోలు గాంధీనగర్‌ 2, ఇందిరా నగర్‌ 2, చర్చిపేట ఒకటి,పురుషోత్తపల్లి 3, తాడిమళ్ల 2, కోరుమామిడి 4, సమిశ్ర గూడెం3 కేసులు నమోదయ్యాయి.ఉండ్రాజవరంలో 2, వడ్లూరులో 2, మోర్త, దమ్మెన్ను ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. పెరవలి మండలంఖం డవల్లి, కానూరులో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు.


కొవ్వూరు/తాళ్లపూడి/ చాగల్లు : కొవ్వూరు నియోజకవర్గంలో 23 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కొవ్వూరులో 4, ఐ.పంగిడి 2, నందమూరు, పశివేదల, వేములూరు, మద్దూరు గ్రామాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. తాళ్లపూడిలో ఒకే ఇంట్లోని ఐదుగురికి, మలకపల్లిలో ఏఎన్‌ఎంకు, పైడిమెట్ట, అన్నదేవరపేటలో ఒక్కొక్కరు కరోనా బారినపడ్డారు. చాగల్లు మండలంలో కలవలపల్లి, బ్రాహ్మణగూడెం, చిక్కాల, చిక్కాలపాలెం, మార్కొండపాడు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 


గోపాలపురం/దేవరపల్లి/ నల్లజర్ల, ఆగస్టు 7 : గోపాలపురం నియోజకవర్గం లో 22 కేసులు నమోదయ్యాయి. గోపాలపురం  హుకుంపేట, అన్నదేవ రపేట గ్రామాల్లో 6, దేవరపల్లి మండలం దేవరపల్లిలో 3, ధుమంతునిగూడెం 3, త్యాజ ంపూడి, దుద్దుకూరులో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. నల్లజర్ల  మండలం అనంతపల్లి-3,కవులూరు-2, అచ్చన్నపాలెం-3 కేసులు నమోదయ్యాయి. అనంతపల్లిలో రేషన్‌ డీలర్‌ దంపతులు కరోనా బారిన పడడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.


చింతలపూడి/ కామవరపుకోట : చింతలపూడి నియోజకవర్గంలో 20 కేసులు నమోదయ్యాయి.చింతలపూడి రాఘవాపురం 4,శివపురం 2, గంటావారి వీధి,వైఎస్‌ఆర్‌ కాలనీ, నాగిరెడ్డిగూడెం, శివాలయం,మారుతీనగర్‌లలో ఒక్కొక్కటి చొప్పున  నమోదయ్యా యన్నారు. కామవ రపుకోట మండలం వీరిశెట్టి గూడెంలో పాజిటివ్‌ సోకిన మహిళ ముగ్గురు కుమార్తెలకు వారి పక్కింట్లో ఉంటున్న మరో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


తాడేపల్లిగూడెంరూరల్‌/ పెంటపాడు :తాడేపల్లిగూడెం నియోజకవర్గ ంలో 15 కేసులు నమోదయ్యాయి.తాడేపల్లిగూ డెంలో 3, మాధవవరం, కుంచ నపల్లి ఆరుగొలను,మోదుగగుంట, జగన్నాథ పురం గ్రామాల్లో ఒక్కో కేసు నమోద య్యాయి.పెంటపాడుమండల కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యో గికి కరోనా సోకడంతో కార్యాలయ పరిసరాల్లో సూపర్‌ శానిటేషన్‌ చేశారు. పెంటపాడు 1, మౌంజీపాడు 3, పరిమెళ్ల 2 కేసులు నమోదయ్యాయన్నారు.


దెందులూరు/పెదపాడు : దెందులూరు నియోజక వర్గంలో 10 కేసులు నమోదయ్యాయి. పెదపాడు మండలం కలపర్రు 2, వట్లూరు, కొత్తూరు గ్రామాల్లో ఒక్కొక్క పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. పెదవేగి మండలం నడిపల్లిలో నాలుగు, లక్ష్మీపురంలో రెండు కేసులు వచ్చాయి.


ఉండి/కాళ్ళ/ఆకివీడు : కాళ్ల, ఆకివీడు మండలాల్లో ఏడేసి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాళ్ల మండలం బొండాడలో 2, జువ్వలపాలెం, కోలనపల్లి,పల్లిపాలెం,దొడ్డనపూడి, కలవపూడి గ్రామాల్లో ఒక్కో కేసు వచ్చాయి.ఉండి మండలంలో రెండు కేసులు నమోదయ్యాయని తహసీల్దారు కృష్ణజ్యోతి తెలిపారు. ఉండి, చెరుకువాడలో ఒక్కో కేసు  నమోదయ్యాయి.

చిన వెంకన్న ఆలయంలో నలుగురు ఉద్యోగులకు..


ద్వారకాతిరుమల : వేంకటేశ్వ రస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు డాక్టర్‌ బాలు తెలిపారు.ఆలయంలో శుక్రవారం కొంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. మిగిలిన వారికి శనివారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈవో ఆర్‌.ప్రభాకరరావు మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదివారం భక్తుల దర్శనాలు నిలిపివేస్తామని తెలిపారు. అయితే స్వామికి ఏకాంత సేవలో కైంకర్యాలు, నివేదనలు నిర్వహిస్తామన్నారు. 


కొత్తగా 26 కంటైన్మెంట్‌ జోన్లు

జిల్లాలో కొత్తగా 26 కంటైన్మెంట్‌ జోన్లు  ప్రకటించడం జరిగిందని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తెలిపారు. భీమవరం అర్బన్‌  8, 7 వార్డులు,యనమదుర్రు 3వ వార్డు, యలమంచిలి మండలం మేడ పాడు 9వ వార్డు, సిరగాలపల్లి 1వ వార్డు, ఉంగుటూరు మండలం గోపాలపురం 4వ వార్డు, గోపీనాథపట్నం 6వ వార్డు, టి నర్సాపురం మండలం తిరుమలదేవి పేట 13వ వార్డు,  మల్లుకుంట 5వ వార్డు, నల్లజర్ల మండలం గంటావారిగూడెం 1వ వార్డు, పోతవరం 16, 12 వార్డులు, సుభద్రపాలెం 1వ వార్డు, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం 3వ వార్డు, శ్రీనివాసపురం 3, 12వ వార్డు, పెదపాడు మండలం నాయుడుగూడెం 2వ వార్డు, శేషాచలపురం 8వ వార్డు, కొవ్వూరు మండలం అరికిరేవుల 3, 4, 5 వార్డులు, కాపవరం 11వ వార్డు, దేవరపల్లి మండలం కురు విలేజ్‌ 3వ వార్డు, ద్వారకాతిరుమల మండలం రాళ్ళగుంట 4, 5, 6 వార్డులు, కామవరపుకోట మండలం తడికలపూడి 1, 2, 7 వార్డులు, కుక్కనూరు మండలం బోనగిరి విలేజ్‌, వీరవాసరం మండలం అండలూరు 7, 8, 9, 10 వార్డులు, పాలకొల్లు   దిగమర్రు 1 నుంచి 6 వార్డులు, లింగపాలెం మండలం 8వ వార్డు, కొత్తపల్లి 8వ వార్డులలో కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-08-08T19:04:02+05:30 IST