Advertisement

హైదరాబాద్‌లో కరోనా టెన్షన్.. మూసాపేట, కూకట్‌పల్లి పరిధిలో ఏకంగా 55 కేసులు

Jun 30 2020 @ 10:04AM

కరోనా విశ్వరూపం.. తగ్గని వైరస్‌ ఉధృతి

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు


హైదరాబాద్‌ సిటీ న్యూస్‌నెట్‌వర్క్‌ (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ కరోనా వైరస్‌ విశ్వరూపం చూపిస్తోంది. మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం గ్రేటర్‌ పరిధిలో 861 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 


యూసుఫ్ గూడ సర్కిల్‌-19 పరిధిలో సోమవారం 26 కరోనా కేసులు నమోదయ్యాయి. యూసు్‌ఫగూడ డివిజన్‌లో 12, ఎర్రగడ్డ డివిజన్‌లో 10, వెంగళరావునగర్‌ డివిజన్‌లో 2, రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాలను అధికారులు కట్టడి చేశారు.


నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో సోమవారం 54 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి.  


కాచిగూడ పోలీస్ స్టేషన్‌ పరిధిలో పది కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. శంషీబాగ్‌లో 39 ఏళ్ల వ్యక్తి, కాచిగూడలో 39 ఏళ్ల మహిళకు, వ్యక్తి(38)కి, నెహ్రూనగర్‌లో వృద్ధుడి(65)కి, బర్కత్‌పురలో వృద్ధుడి(75)కి, నెహ్రూనగర్‌లో 30 ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. 


నల్లకుంట డివిజన్‌లో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లకుంటలో ఉంటున్న మహిళ(50), తిలక్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(46), 38 ఏళ్ల వ్యక్తికి, 13 ఏళ్ల బాలికకు, నర్సింహబస్తీకి చెందిన 9 ఏళ్ల బాలుడికి, నల్లకుంటకు చెందిన ఏడేళ్ల బాలుడికి కరోనా సోకింది. అంబర్‌పేట నియోజకవర్గంలో ముగ్గురు చిన్నారులు కరోనా బారినపడ్డారు. వీరిలో ఇద్దరు బాలురు, ఓ బాలిక ఉన్నారు. 


కుత్బుల్లాపూర్‌లో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దుండిగల్‌కు చెందిన ఓ మహిళ(37), చింతల్‌ బాపూనగర్‌కు చెందిన ఓ వ్యక్తి(35), గిరినగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. 


మూసాపేట, కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో సోమవారం 55కరోనా కేసులు నమోదయ్యాయి. మూసాపేట సర్కిల్‌లో 40, కూకట్‌పల్లిలో 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. మూసాపేట, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, బోయిన్‌పల్లి, బాలానగర్‌, కేపీహెచ్‌బీకాలనీ, వివేకానంద నగర్‌కాలనీల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.


ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో మూడు పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. వీటితోపాటు 54 అనుమానిత కేసులకు చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. ఆయుర్వేద ఆస్పత్రిలో 139 పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు. 


రామంతాపూర్‌ కామాక్షినగర్‌కు చెందిన ఓ మహిళ, మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. 


రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో సోమవారం పదిమందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదర్‌గూడలో వృద్ధుడి(62)కి, మహిళ(26), ఏడాది చిన్నారికి, వృద్ధురాలి(72)కి, జనప్రియలో నివసిస్తున్న మహిళ(54), కాటేదాన్‌లో ఓ వ్యక్తి(56), మైలార్‌దేవ్‌పల్లిలో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. 


ఖైరతాబాద్‌ సర్కిల్‌లో సోమవారం 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబంలో ఓ జంటకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం మరో ముగ్గురికి కరోనా సోకింది. మాజీ కార్పొరేటర్‌కు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. 


ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలో 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాగోల్‌ నువ్వులబండకు చెందిన వ్యక్తి, బీఎన్‌రెడ్డినగర్‌ చైతన్యనగర్‌ ఫేజ్‌-2కు చెందిన మరొకరు, హయత్‌నగర్‌ సత్యానగర్‌కు చెందిన మహిళ, బండ్లగూడ ఇందు అరణ్యకు చెందిన 60 ఏళ్ల మహిళ, వనస్థలిపురం గౌతమినగర్‌లో ఓ మహిళ (32), ప్రశాంత్‌నగర్‌కు చెందిన వ్యక్తి(49), ఎల్‌బీనగర్‌ అప్సరా బార్‌లేన్‌లో ఉంటున్న యువతి(27), మసీద్‌లేన్‌కు చెందిన మహిళ(58), సౌభాగ్యనగర్‌లో మరో మహిళ(60), డీఆర్‌టీకాలనీలో ఉంటు న్న 55 ఏళ్ల మహిళకు, దిల్‌సుఖ్‌నగర్‌ భవానీనగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, ఎల్‌బీనగర్‌లో ఓ వ్యక్తి(37), హస్తినాపురం సౌభాగ్యనగర్‌కు చెందిన ఒకరి(60)కి, చైతన్యపురిలో 33 ఏళ్ల వ్యక్తికి, కొత్తపేట సౌభాగ్యపురం కాలనీలో ఒకరి(38)కి, ధర్మపురి కాలనీలో ఉంటున్న మహిళ(47), హుడా కాంప్లెక్స్‌కు చెందిన ఓ వ్యక్తి(46), కొత్తపేటకు చెందిన యువతి(24), డాక్టర్స్‌ కాలనీకి చెందిన యువతి(28), కొత్తపేట లక్ష్మీనగర్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన 29ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


మలక్‌పేటలో పలు ప్రాంతాల్లో ఉంటున్న 11 మందికి కరోనా సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఆజంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నలుగురికి, జాంబాగ్‌ పార్క్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇద్దరికి, శాలివాహన నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నలుగురికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గడ్డిఅన్నారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని బాటసింగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది.  


తుర్కయంజాల్‌ మునిసిపాలిటీ పరిధిలోని మునగనూర్‌కు చెందిన వ్యక్తి(42)కి కరోనా సోకింది. 


కవాడిగూడ సీజీఎస్‌ టవర్స్‌లోని పీబీఐ కార్యాలయంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. అడిషనల్‌  డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ సహా కొందరు ఉద్యోగులకు వైరస్‌ సోకింది.


కరోనా మహమ్మారి మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌కు తాకింది. పరిశ్రమల శాఖలో పనిచేసే ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం కార్యాలయాలను శానిటైజ్‌ చేశారు. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న వారందరికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. పరిశ్రమ శాఖలోని ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. 


ఘట్‌కేసర్‌ మునిసిపాలిటీలోని మేధాకాలనీలో పాజిటివ్‌ కేసు నమోదైంది. మండల పరిధిలోని జోడిమెట్ల వద్ద గల ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేసే మహిళ(32)కు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. 

Follow Us on:
Advertisement
Advertisement