బ్రిటన్‌లో మళ్లీ కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2020-10-30T10:14:04+05:30 IST

ఇంగ్లండ్‌లో కరోనా రెండోదశ విజృంభణ తీవ్ర స్థాయికి చేరుకుంది. రోజూ దాదాపు లక్ష మంది వరకూ వైరస్‌ బారిన పడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి 9 రోజులకు కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇంపీరి

బ్రిటన్‌లో మళ్లీ కరోనా కల్లోలం

  • రోజూ లక్ష వరకూ కొత్త కేసులు 
  • భారీగా పెరిగిన మరణాల రేటు 
  • ఫాన్స్‌లో నేటినుంచి లాక్‌డౌన్‌ 

లండన్‌/ప్యారిస్‌, అక్టోబరు 29: ఇంగ్లండ్‌లో కరోనా రెండోదశ విజృంభణ తీవ్ర స్థాయికి చేరుకుంది. రోజూ దాదాపు లక్ష మంది వరకూ వైరస్‌ బారిన పడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి 9 రోజులకు కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం అక్టోబరు 16- 25 మధ్య దేశవ్యాప్తంగా 85వేల మంది నుంచి నమూనాలు సేకరించగా ప్రతి పదివేల మందిలో 128 మందికి కొవిడ్‌ సోకినట్లు వెల్లడైంది. అక్టోబరు 5న ఈ సంఖ్య 60 మాత్రమే కావడం గమనార్హం.  55-65 ఏళ్ల వయసున్న వారిలో మృతుల సం ఖ్య మూడురెట్లు పెర గ్గా, 65 ఏళ్లు పైబడిన వారిలో మరణాల రేటు రెండురెట్లు పెరిగింది. ఈసారి మరింత కట్టుదిట్టం గా లాక్‌డౌన్‌ అమలు చేయాలని కరోనా విజృంభణపై నియమించిన సేజ్‌ కమి టీ సూచించింది. గడిచిన 24గంటల్లో 24,700 మంది కొవిడ్‌ బారిన పడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. అక్టోబరు 30నుంచి డిసెంబరు 1 వర కూ ఆంక్షలు అమలులో ఉంటాయని దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ప్రకటించారు.  


Updated Date - 2020-10-30T10:14:04+05:30 IST