ఐలాపూర్‌ పాఠశాలలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-03-04T06:32:47+05:30 IST

కోరుట్ల మండలం ఐలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపింది.

ఐలాపూర్‌ పాఠశాలలో కరోనా కలకలం
తరగతి గదిని శానిటైజేషన్‌ చేస్తున్న పంచాయతీ సిబ్బంది

- ఇద్దరు ఉపాధ్యాయులు.. ఒక విద్యార్థికి సోకిన వైరస్‌

- భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

- ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టిన పంచాయతీ సిబ్బంది

- విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు

కోరుట్ల రూరల్‌, మార్చి 3: కోరుట్ల మండలం ఐలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపింది. మంగళవారం పాఠశా లలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థికి జ్వరం రావడంతో ఉపా ధ్యాయులు విద్యార్థికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీ క్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యసిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలోని 25మంది విద్యా ర్థులు, ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించారు. దీంతో పాఠశాల ప్రధా నోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయురాలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విద్యార్థితోపాటు ఉపాధ్యాయులను హోంక్వారెం టైన్‌కు తరలించారు. గ్రామసర్పంచ్‌ పిడుగు రాధ ఆధ్వర్యంలో పాఠశాలలోని తరగతి గదులను శానిటైజ్‌ చేశారు. కరోనా భయంతో మిగితా విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు పంపేందుకు ఇష్టపడలేదు. మిగితా ఉపాధ్యాయులు మాత్రం యథావిధిగా పాఠశాలకు హాజరు అయ్యారు.

Updated Date - 2021-03-04T06:32:47+05:30 IST