Advertisement

మెట్‌పల్లిలో కరోనా కలకలం

Aug 1 2020 @ 05:40AM

 ఒకే రోజు 15 పాజిటివ్‌ కేసులు నమోదు

 ఒకే కుటుంబంలో ఐదుగురికి వైరస్‌


మెట్‌పల్లి, జూలై 31: కరోనా వైరస్‌ మెట్‌పల్లిలో ఒక్కసా రిగా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజు మెట్‌పల్లి  పట్టణంలో 15 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం సృష్టించింది. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్‌ కేంద్రంలో 35 మంది అనుమానిత వ్యక్తులకు పరీక్షలు చేయగా ఇందులో 15 మందికి పాజిటివ్‌గా తేలిందని ప్రభుత్వ వైద్యులు అమరేశ్వర్‌, నరేందర్‌లు ప్రక టించారు.


పాజిటివ్‌ వచ్చిన వారిలో ఓ మున్సిపల్‌ కౌన్సి లర్‌, ఓ కానిస్టేబుల్‌ సతీమణికి, ఓ టిఫిన్‌ సెంటర్‌ వ్యాపా రి, ఓ వ్యాపారి కుటుంబ సభ్యులలో ఐదుగురికి, ఓ బట్టల దుకాణం కార్మికునికి కరోనా వైరస్‌ సోకిన వారిలో ఉన్న ట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీసీ హాస్టల్‌ భవనాన్ని ఐసోలేషన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయడానికి వసతులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పరిశీలించారు.


జిల్లాలో 29 కేసులు 

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో 29 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జగిత్యాల పట్టణం లో ఆరుగురికి, కోరుట్లలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మెట్‌పెల్లిలో పట్టణంలో 15 మందికి , కొడి మ్యాలలో రెండు, కథలాపూర్‌లో ఒకరికి కరోనా సోకి నట్లు జిల్లా వైధ్యాధికారి తెలిపారు. 

Follow Us on:
Advertisement
Advertisement