రాష్ట్రాలలో కరోనా నియంత్రణ.. ఆంక్షల తీరు

ABN , First Publish Date - 2021-04-12T09:28:42+05:30 IST

రాష్ట్రాలలో కరోనా నియంత్రణ.. ఆంక్షల తీరు

రాష్ట్రాలలో కరోనా నియంత్రణ.. ఆంక్షల తీరు

పంజాబ్‌

రాష్ట్రమంతా రాత్రి కర్ఫ్యూ. రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు రద్దు. బడులు, కాలేజీలు మూత.


హర్యానా

కాలేజీలు, పాఠశాలలపై ఆంక్షల్లేవు. పెళ్లి, బహిరంగ కార్యక్రమాలకు 200-500 మందికే అనుమతి.


రాజస్థాన్‌

పది నగరాలలో రాత్రి కర్ఫ్యూ అమలు. బడులు, కాలేజీలు మూత. 


గుజరాత్‌

ఏప్రిల్‌ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ. పెళ్లిళ్లకు 100 మందికే అనుమతి. తొమ్మిదో తరగతి వరకూ బడులు ఏప్రిల్‌ 18 వరకూ మూత.


మహారాష్ట్ర

ఏప్రిల్‌ చివరి వరకూ అన్ని బీచ్‌లు మూత. వారాంతాల్లో లాక్‌డౌన్‌, రాత్రి 1 నుంచి ఉదయం 7 వరకూ కర్ఫ్యూ


గోవా

ప్రజల కదలికలపై ఎలాంటి ఆంక్షలూ లేవు. పదో తరగతి పై క్లాసులకు మినహా బడులు మూత. సెక్షన్‌ 144 వర్తింపు. బహిరంగ సభలపై నిషేధం.


కేరళ

విదేశాల నుంచి వచ్చేవారు వారంపాటు క్వారంటైన్‌లో ఉండాలి.


తమిళనాడు

పండుగలు, మత కార్య క్రమాలు రద్దు. కోయం బేడ్‌ మార్కెట్‌లో రిటైల్‌ అమ్మకాలపై నిషేధం. రెస్టారెంట్లు, క్లబ్బుల్లో 50 శాతం మందికే అనుమతి


తెలంగాణ

అన్ని బడులు, కాలేజీలు, వర్సిటీలు మూత. 


కర్ణాటక

బెంగళూరు సహా ఆరు నగరాలలో రాత్రి కర్ఫ్యూ.


ఛత్తీస్‌గఢ్‌

రాయ్‌పూర్‌లో ఏప్రిల్‌ 17 వరకూ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌. అన్ని పట్టణాలలో రాత్రి కర్ఫ్యూ అమలు. బస్సుల్లో 50 శాతం మందికే అనుమతి.


ఉత్తరప్రదేశ్‌

గౌతంబుద్ధనగర్‌, ఘజియాబాద్‌ ప్రాంతాలలో ఏప్రిల్‌ 17 వరకూ రాత్రి కర్ఫ్యూ.


జార్ఖండ్‌

మతపరమైన ర్యాలీలపై నిషేధం. ఏడో తరగతి వరకూ బడులు మూత. 


ఒడిశా

9, 11 తరగతుల విద్యా ర్థులకు బడులు మూత. 


మధ్యప్రదేశ్‌

సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకూ లాక్‌డౌన్‌. చింద్వారాలో ఏప్రిల్‌ 16 వరకూ, రాట్లం, బెతూల్‌; కట్ని, ఖార్‌గోన్‌లలో ఏప్రిల్‌ 17 వరకూ లాక్‌డౌన్‌. బడులు, కాలేజీలు మూత. 


బిహార్‌

ఏప్రిల్‌ 11 వరకూ బడులు, కాలేజీలు మూత. పెళ్లిళ్లు,  కార్యక్రమాలకు 200 మంది వరకే అనుమతి. బస్సుల్లో  సగం మందికే అనుమతి.


ఢిల్లీ

ఏప్రిల్‌ చివరి వరకూ రాత్రి కర్ఫ్యూ. ప్రాక్టికల్‌ సెషన్స్‌కు మాత్రమే బడులు, కాలేజీలకు అనుమతి. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు 100 నుంచి 200 మంది వరకూ అనుమతి.


హిమాచల్‌

ఏప్రిల్‌ 15 వరకూ బడులు మూత. పెళ్లిళ్లకు 200 మందికి, కల్యాణ మండపాలలో 50 మందికి మాత్రమే అనుమతి.


ఉత్తరాఖండ్‌

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు సమర్పించాలి.


చండీగఢ్‌

రాత్రి కర్ఫ్యూ అమలు. ఏప్రిల్‌ 10 వరకూ బడులు, కాలేజీలు మూత.


జమ్మూ కశ్మీర్‌

ఏప్రిల్‌ 18 వరకూ బడులు మూత. ఇండోర్‌ గేమ్స్‌ తాత్కాలిక రద్దు

Updated Date - 2021-04-12T09:28:42+05:30 IST