కరోనా నియంత్రణ సామాజిక బాధ్యతగా భావించాలి

ABN , First Publish Date - 2021-04-23T05:42:19+05:30 IST

కరోనా నియంత్ర ణ సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కొవిడ్‌ ప్రత్యేకాధికారి ఎస్‌.సత్యనారా యణ అన్నారు.

కరోనా నియంత్రణ సామాజిక బాధ్యతగా భావించాలి
పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో కొవిడ్‌ వార్డును పరిశీలిస్తున్న జిల్లా కొవిడ్‌ ప్రత్యేకాధికారి సత్యనారాయణ

పార్వతీపురం / సీతానగరం / పాచిపెంట, ఏప్రిల్‌ 22: కరోనా నియంత్ర ణ సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కొవిడ్‌ ప్రత్యేకాధికారి ఎస్‌.సత్యనారా యణ అన్నారు. గురువారం ఆయన జేసీ కిశోర్‌కుమార్‌, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌తో కలిసి పాచిపెంట, సీతానగరం మండలాల్లో కొవిడ్‌ కేంద్రాల ఏర్పాటుకు పరిశీలన చేశారు. పాచిపెంట మండలం పి.కోనవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, సీతానగరం మండలం జోగింపేట ప్రతిభా కళాశాలలో కోవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గరుగుబిల్లి మండలంలో ఉల్లిభ ద్ర సమీపంలోని ఉద్యాన కళాశాలలో కూడా కొవిడ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామ న్నారు. అనంతరం పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో ఉన్న కొవిడ్‌ వార్డును పరిశీలించారు. కరోనా నిర్మూలనకు మాస్కు ధరించడం, సామాజిక దూరం, చేతులను శుభ్రం చేసు కోవడంపై అవగాహన కల్పించారు. ఈ పరిశీలనలో జిల్లా పరిషత్‌ సీఈవో వెంకటేశ్వ రరావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాగ్దేవి, డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌రెడ్డి, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-04-23T05:42:19+05:30 IST