ఏపీలో కరోనా మరణ మృదంగం

Jun 16 2021 @ 23:49PM
కడప తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న అమీర్‌బాబు

తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి రూ.10 వేలు ఇవ్వాలి

టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు

కడప, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఏపీలో కరోనా మరణ మృదంగం మోగుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 7,87,883 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, 1,763 మంది చనిపోయారని తెలిపారు. టీడీపీ అధిష్టాన ఆదేశాల మేరకు బుధవారం పది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దారు శివరామి రెడ్డికి అందజేశారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న కరోనా బాధితులకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా, జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివకొండారెడ్డి, జలతోటి జయకుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శి మాసా కోదండరామ్‌, వరప్రసాద్‌, మైనార్టీ నాయకుడు నాసిర్‌ అలీ పాల్గొన్నారు.


కమలాపురంలో...

కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ మండల కన్వీనర్‌ రాఘవరెడ్డి, జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుడు ఖాదర్‌బాషలు విమర్శించారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దారు విజయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దివాకర్‌రెడ్డి, జంపాల నరసింహారెడ్డి, యల్లారెడ్డి, సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


చెన్నూరులో... 

రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫల మైందని మండల టీడీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి సూచనల మేరకు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారు క్రిష్ణారెడ్డికి మండల టీడీపీ నేతలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షుడు కె.విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శివారెడ్డి, మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నూరు అక్బర్‌, జిల్లా మాజీ అధికార ప్రతినిధి మల్లిఖార్జునరెడ్డిలు మాట్లాడారు. కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు షబ్బీర్‌హుసేన్‌, ఖాజాహుసేన్‌, మంజీర్‌ అహ్మద్‌, ఓబుల్‌రెడ్డి, అయ్యవారురెడ్డి, కుందేటి క్రిష్ణయ్య, ఎ.విశ్వం పాల్గొన్నారు.


పెండ్లిమర్రిలో... 

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతం చేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు గంగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రం తహసీల్దారుకు అందించారు. కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు బయన్న, శంకర్‌రెడ్డి, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సీకేదిన్నెలో...

కరోనాతో మృతిచెందిన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థికసాయం ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ మండల ఇన్‌ఛార్జి బద్వేలు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ రాష్ట్ర ఆదేశాల మేరకు మండల తహసీల్దారును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు విశ్వనాథరెడ్డి, రాజారావు, సుబ్బనరసయ్య, బారాహుస్సేన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.