కరోనా వ్యాప్తి తగ్గుముఖం

Jun 22 2021 @ 01:25AM
కరోనాతో చనిపోయిన సత్యవేడుకు చెందిన నాగేశ్వరరావు- భర్త మరణ వార్తను తట్టుకోలేక హైబీపీతో మృతి చెందిన ఆయన భార్య మునీంద్ర (ఫైల్‌ఫొటో)

తాజా కేసులు 531 ... మరో 10 మంది మృతి


తిరుపతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 531 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 10 మంది కొవిడ్‌తో మరణించారు. ఒక రోజు వ్యవధిలో ఇంత తక్కువ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గత ఏప్రిల్‌ నుంచీ ఇదే మొదటిసారి. జిల్లాలో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతు న్నాయని ఈ కేసుల సంఖ్యే చెబుతోంది. కాగా తాజాగా గుర్తించిన బాధితు లతో జిల్లాలో ఇప్పటి దాకా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 214719కి చేరగా కొవిడ్‌ మృతుల సంఖ్య 1541కి పెరిగింది. సోమవారం ఉదయానికి జిల్లాలో 8765 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 44, చిత్తూరులో 33, తిరుపతి రూరల్‌లో 28, పలమ నేరులో 23, శాంతిపురం, వరదయ్యపాళ్యం మండలాల్లో 22 వంతున, పుత్తూ రు, బంగారుపాళ్యం మండలాల్లో 18 చొప్పున, కేవీబీపురం, సత్యవేడు మండ లాల్లో 17 వంతున, వి.కోటలో 16, పూతలపట్టు, ఐరాల మండలాల్లో 15 వంతున, కార్వేటినగరంలో 14, పెద్దమండ్యంలో 13, చౌడేపల్లె, రామసముద్రం మండలాల్లో 12 చొప్పున, కుప్పం, సోమల, పాకాల, రామకుప్పం, జీడీనెల్లూరు మండలాల్లో 10 చొప్పున, యాదమరిలో 9, శ్రీరంగరాజపురం, పెద్దపంజాణి, కలకడ మండలాల్లో 8 వంతున, తవణంపల్లె, పాలసముద్రం మండలాల్లో 7 చొప్పున, సదుం, నాగలాపురం, వడమాలపేట మండలాల్లో 6 వంతున, శ్రీకాళహస్తి, నగరి, పీలేరు, వాల్మీకిపురం, పుంగనూరు మండలాల్లో 5 చొప్పున, మదనపల్లె, కలికిరి, గుడిపాల మండలాల్లో 4 వంతున, చిన్నగొట్టి గల్లు, కేవీపల్లె, నారాయణవనం, రామచంద్రాపురం, పీటీఎం, విజయపురం మండలాల్లో 3 చొప్పున, పులిచెర్ల, తొట్టంబేడు, రేణిగుంట, బీఎన్‌ కండ్రిగ, తంబళ్ళపల్లె, బైరెడ్డిపల్లె, వెదురుకుప్పం మండలాల్లో 2 చొప్పున, గంగవరం, బి.కొత్తకోట, గుర్రంకొండ, పిచ్చాటూరు, పెనుమూరు, రొంపిచెర్ల, కురబలకోట, నిమ్మనపల్లె మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.