విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-24T03:23:24+05:30 IST

మండలంలోని సెకండ్‌వేవ్‌ కరోనా వైరస్‌ విజృంభించి ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారు.

విజృంభిస్తున్న కరోనా

వణుకుతున్న మండల ప్రజలు

ముగ్గురు మృతి

 పట్టించుకోని అధికార యంత్రాంగం

చిట్టమూరు, ఏప్రిల్‌ 23: మండలంలోని సెకండ్‌వేవ్‌ కరోనా వైరస్‌ విజృంభించి ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారు. మండలంలోని 4 పీహెచ్‌సీల పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యల్లసిరిలో ఒకరు, మన్నెమాలలో ఇద్దరు కరోనా వైరస్‌కు బలయ్యారు. చిట్టమూరు పీహెచ్‌సీ పరిధిలో 8 కేసులు, ఈశ్వరవాక పీహెచ్‌సీ పరిధిలో 3, మల్లాం పీహెచ్‌సీ పరిధిలో 5, గునపాటిపాళెం పీహెచ్‌సీ పరిఽధిలో 4 కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు నెల్లూరులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతుండగా, మరి కొందరు హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

వణుకుతున్న పల్లెలు....

కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు, పాలకులు అడ్రస్‌ లేకుండా పోయారు. దీంతో పల్లెల్లో శానిటేషన్‌  లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు కళ్లుతెరచి కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టడడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-04-24T03:23:24+05:30 IST