కరోనా కలవరం

ABN , First Publish Date - 2021-04-22T06:29:37+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలను కలవర పెడుతోంది. రెండు, మూడు రోజుల క్రితం వరకు అందరితో కలిసి తిరిగి మాట్లాడిన వారు అంతలోనే మృత్యువాతపడుతు న్నారు.

కరోనా కలవరం

 నెలరోజుల్లోనే 88మంది మృతి

 రెండు రోజుల్లో 10 మంది మృత్యువాత 

 బ్లాక్‌ మార్కెట్‌లో రెమ్‌డీసీవర్‌ 

 రూ.15 నుంచి 20వేల రూపాయలకు అమ్మకం 

హెల్ప్‌డెస్క్‌ పెట్టి అందించాలని కోరుతున్న ప్రజలు 

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వేయి మంది 

 భయాందోళనలో ప్రజలు 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలను కలవర పెడుతోంది. రెండు, మూడు రోజుల క్రితం వరకు అందరితో కలిసి తిరిగి మాట్లాడిన వారు అంతలోనే మృత్యువాతపడుతు న్నారు. ఏ లక్షణాలు లేకుండా కొందరు ఆకస్మాత్తుగా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరి మరణిస్తుండగా మరికొందరు జిల్లా కేంద్రంలో, హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృత్యువాత పడుతున్నారు. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తర్వాత గడిచిన నెలరోజుల్లో జిల్లాలో 88 మంది మృత్యువాతపడగా అందులో 52 మంది కరీంనగర్‌ పట్టణానికి చెందిన వారే ఉన్నారు. అత్యధికంగా రామడుగు మండలంలో ఎనిమిది మంది, చొప్పదండి మండలంలో ఐదుగురు, చిగురుమామిడి మండలంలో ముగ్గురు, కొత్తపల్లి మండలంలో ముగ్గురు, జమ్మికుంట మండలంలో, తిమ్మాపూర్‌ ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. హుజురాబాద్‌, ఇల్లందకుంట, సైదాపూర్‌, శంకరపట్నం, మానకొండూర్‌,  గన్నేరువరం, గంగాధర మండలాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా మృతిచెందారు. కరీంనగర్‌ పట్టణంలోని 60 డివిజన్లు ఉండగా 26 డివిజన్లలో 52 మంది కరోనా బారిన  మరణించారు. 49వ డివిజన్‌లో ఏడుగురు, 51, 56 డివిజన్లలో నలుగురుచొప్పున, 4,9,16,35 డివిజన్లలో ముగ్గురేసి చొప్పున చనిపోయారు. 4,16 డివిజన్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చొప్పున మృతిచెందడంతో ఆయా కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయా యి. మిగతా డివిజన్లలో ఇద్దరు లేక ఒకరు చొప్పున మరణించారు. అధికారుల లెక్కల ప్రకారం గత మార్చి18 నుంచి ఏప్రిల్‌ 20వరకు జిల్లావ్యాప్తంగా 48 మంది మరణించినట్లు రికార్డు అయింది. 

అయితే స్థానికంగా అందిన సమాచారం మేరకు 84 మంది మరణించారు. కొందరు గుండెపోటు, తదితర అనారోగ్యాలతో ఆకస్మికంగా మరణించారు. వారిలో కూడా అత్యధికులు ఏ లక్షణాలు లేకుండా కరోనాకు గురైనవారే ఉండి ఉంటా రని, అలాంటి వారిలోనే రక్తం గడ్డకట్టడంతో అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోవడం, గుండెపోటు, బ్రెయిన్‌ రస్ర్టోక్‌ లాంటివి రావడం, కిడ్నీలు పనిచేయకుండా పోవడం సంభవిస్తూ అకాల మరణాలకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ రెండవ వేవ్‌లో కరోనా మరణాలుగా నమోదు కాకుం డా పోయినా మరణాలు మరికొన్ని కూడా ఉన్నాయని భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఈనెల 20 వరకు  జిల్లాలో కరోనాబారిన పడ్డవారు 4,474 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 116 మంది, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 704 మంది చికిత్స పొందుతున్నారు. 


హెల్ప్‌డెస్క్‌ కావాలని కోరుతున్న ప్రజలు 


కరోనా జిల్లాలో మృత్యుఘంటికలు మోగి స్తూ రోజుకు వందలాది మంది వ్యాధిబారిన

పడుతున్న నేపథ్యంలో కరోనా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ హెల్ప్‌ డెస్క్‌ రోగులను ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేర్చడానికి, అలాగే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రెమ్‌డిసివర్‌ తదితర మందులు అందుబాటులో ఉండేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హెల్ప్‌ డెస్క్‌ ఉన్న చోటే రెమ్‌డిసివర్‌ లాంటి ప్రాణరక్షక మందులను అందుబాటులో ఉంచి వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా చూడాలని కోరుతున్నారు. 


జిల్లాలో నలుగురి మృతి.. 357 మందికి కొత్తగా కరోనా  


జిల్లాలో బుధవారం కరోనా సోకి చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. 357 మంది కొత్తగా వ్యాధిబారినపడ్డారు. చొప్పదండికి చెందిన ఒక ఆర్‌ఎంపీ వైద్యుడు పది రోజులుగా కరీంనగర్‌ ప్రైవేట్‌ ఆసుపత్రి లో కరోనా చికిత్స పొందుతూ బుధవారం మరణించా డు. అలాగే శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వ్యక్తి కూడా కరోనా బారినపడి మృతిచెందాడు. గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన 60 సంవత్సరాల వృద్ధుడికి వారం క్రితం పాజిటివ్‌ రాగా కరీంనగర్‌ ప్రభుత్వం ఆసుపత్రిలో చేరాడు. ఆయన చికిత్సపొందుతూ మరణించగా అదే గ్రామాని కి చెందిన 24 సంవత్సరాల యువతి కూడా కరోనాతో మృత్యువాతపడ్డారు. జిల్లావ్యాప్తంగా 2,430 పరీక్షలు నిర్వహించగా 357 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కరీంనగర్‌ పట్టణంలో 671 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 160 మం దికి పాజిటివ్‌ వచ్చిం ది. అలాగే మండలాల్లో 1559 మందికి పరీక్షలు నిర్వహించగా 197 మంది వ్యాధిపీడితులుగా మారారు. 


 బ్లాక్‌ మార్కెట్‌లో రెమిడిసివర్‌


ప్రస్తుతం కరోనా వ్యాధిని కట్టడి చేయడానికి వైద్యులు రెమిడిసివర్‌ ఇంజక్షన్‌ వాడుతున్నారు. దీనికి గతంలో సుమారు 5వేలు నుంచి 5,200 వరకు ధర ఉండగా ఇటీవల ప్రభుత్వం ధరలను తగ్గించిం ది. తగ్గించిన ధరల ప్రకారం ఈ మందులు 2,450 నుంచి 3,490 వరకు ఆయా కంపెనీలను బట్టి విక్రయించాల్సి ఉంది. అయితే జిల్లాలో మాత్రం 15వేల నుంచి 20వేల వరకు డిమాండ్‌ను అనుసరించి బ్లాక్‌ లో విక్రయిస్తున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొం దుతున్నవారి వద్దకు వెళ్లి వారి బంధువులను ప్రశ్ని స్తే ఎవరెవరూ ఎంతెంత ధరను చెల్లించి రెమిడిసివర్‌  ఇంజక్షన్‌ కొనుగోలుచేశారో తేటతెల్లమవుతుంది. వారి బంధువులు పూర్తిగా కోలుకోనందువల్ల మళ్లీ ఇంజక్షన్‌ అవసరమైతే అదే వ్యాపారుల వద్దకు వెళ్లా ల్సి వస్తుందనే భయంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే అటు జిల్లా యం త్రాంగం గానీ, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గానీ ఫిర్యాదు లు రానందువల్ల అంతా సజావుగానే ఉందన్న భ్రమలో ఉన్నా రని ఆరో పణలు వస్తున్నాయి. ప్రైవేట్‌ మెడికల్‌ ఏజెన్సీలపై కరోనా చికిత్స ఇస్తున్న ఆసుపత్రిపై నిఘాపెట్టామని చెబుతు న్నా గత నాలుగురోజులుగా పరిస్థితిలో మార్పేమి రా లేదు. మంత్రి గంగుల కమలాకర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డ్రగ్‌ ఇన్‌ స్పెక్టర్‌ తదితర సంబంధిత అధికారులు, అనధికారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి జిల్లాకు 3,000 రెమ్‌డిసివర్‌ వాయిల్స్‌ తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 


  ప్రైవేట్‌ హాస్పిటల్స్‌పై నిరంతరం నిఘా


ప్రస్తుత కరోనా సంక్షోభంలో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో మానవతా ధృక్పథంతో వైద్యం అందించాలని మంత్రి గంగులా కమలాకర్‌ కోరారు. రెమిడిసివర్‌ ఇతర అత్యవసర మందుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి జిల్లా కలెక్టర్‌ శశాంక, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్‌ హాస్పిటళ్లకు సరఫరా అయిన రెమిడిసివర్‌, ఇతర మందుల్ని ఏ పేషెంట్లకు, ఎప్పుడు, ఎన్ని మోతాదు వాడారో పక్కా గా లెక్కలు నిర్వహించాలని, వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వాధికారుల ప్రత్యేక తనిఖీల ద్వారా పర్యవేక్షి స్తారని తెలిపారు. ఇందుకోసం అవసరమైన సిబ్బంది తో రెండు రోజుల్లో పటిష్ట కార్యాచరణ రూపొంది స్తామని, ఏ ఒక్క హాస్పిటల్‌కాని, వైద్యులు లేదా ఇత ర సిబ్బంది కానీ అక్రమంగా వీటిని నిల్వచేసినా ఎ క్కువ ధరలకు అమ్ముకున్నా కఠిన చర్యలు తీసుకుం టామన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ఆరో గ్యంతో ఎవరూ ఆటలాడుకోవద్దని, సామాన్య ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఇందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకు వెనకాడ మని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో అక్రమాలకు పాల్పడే వారిని హెచ్చరిం చారు. అత్యవసర మందుల సరఫరా కోసం ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధి కారులతో మా ట్లాడామని ఫార్మా సంస్థలు  మందుల్ని అందించేం దుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజలెవరూ అపోహలకు, భయాందోళనలకు గురికాద్దని పిలుపునిచ్చారు. 


జిల్లాలో కరోనా కేసుల పర్యవేక్షణకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో విజిలెన్స్‌ సెల్‌ ఏర్పాటు


కరోనా కేసుల పర్యవేక్షణకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో విజిలెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ ఆసుపత్రి ఎంత రెమిడిసివిర్‌ తీసుకుంది. పే షెం ట్‌కు ఇచ్చారా లేక బ్లాక్‌ చేశారా తీసుకునేం దుకు విజిలెన్స్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఒక్కొ క్క రెసిడిసివిర్‌ ఇంజక్షన్‌ రూ.20 వేలకు అమ్ముతు న్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రజల జీవితాలతో ఆడుకోవద్ద ని తెలిపారు. రోజుకు వెయ్యి రేమి డిసివిర్‌ ఇంజక్షన్లు కరీంనగర్‌కు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఏ ఆ సుపత్రికి ఎన్ని రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు అవసరమో మేమే అందిస్తామని, రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు ఏ పేషెంట్‌కు ఇస్తున్నారో పక్కాగా పర్యవేక్షిస్తామన్నారు. 


అధిక ధరకు రెమిడెసివర్‌

రూ.50వేలకు రెండు ఇంజక్షన్లు అమ్మినట్లు ఆరోపణ

అకీరా హాస్పిటల్‌కు నోటీసు


   రెమిడెసివర్‌ ఇంజక్షన్లు అధిక ధరకు అమ్మినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ పట్టణంలోని అకీరా హాస్పిటల్‌కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి డాక్టర్‌ రవీందర్‌ నోటీసు జారీ చేశారు. రెమ్‌డిసివర్‌ మందును అధిక ధరకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆసు పత్రి లైసెన్సు ఎందుకు రద్దు చేయరాదో 24 గం టల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అకీరా హాస్పిటల్‌లో రెమిడెసివర్‌ రెండు ఇంజక్షన్లకు 50వేల రూపాయలు తీసుకున్నట్లు ఒకరు వీ డియో చిత్రీకరించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కలెక్టర్‌ జిల్లా వైద్యాశాఖ అధికారి ని విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి బుధవారం ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌కు నోటీసు జారీ చేస్తూ వివరణ ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-04-22T06:29:37+05:30 IST